స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ ఎవరో తేల్చేశారు. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదలైన 2 సినిమాలని ఆయన పక్కన పెట్టేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి వరకు ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి.
25
చిరంజీవి డామినేషన్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా డామినేషన్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కనిపిస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ చిత్రం తేలిపోయింది. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన రాజాసాబ్ ఆకట్టుకోలేకపోయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది.
35
సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేసిన దిల్ రాజు
అయితే దిల్ రాజు రీసెంట్ గా మాట్లాడుతూ అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేశారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన దిల్ రాజు సంక్రాంతి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు.
అదే విధంగా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సూపర్ హిట్ అయింది. నారీ నారీ నడుమ మురారి చిత్రం కూడా మంచి విజయం సాధించింది అని దిల్ రాజు తేల్చేశారు. మిగిలిన రెండు సినిమాలు ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల గురించి ఆయన ప్రస్తావించలేదు.
55
సంక్రాంతికి 3 విజయాలు
అదృష్టం కొద్దీ తాము డిస్ట్రిబ్యూట్ చేసిన మూడు సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి మూడు చిత్రలు విజయం సాధించాయి అని దిల్ రాజు అన్నారు.