ఆ విషయంలో అల్లు అర్జున్-స్నేహారెడ్డికి గొడవలు... స్టార్ కపుల్ మధ్య ఏం జరుగుతుంది?

First Published | Mar 26, 2024, 9:03 AM IST

అల్లు అర్జున్-స్నేహారెడ్డికి ఒక విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయట. ఈ మేరకు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లవ్లీ కపుల్ మధ్య చిచ్చుపెట్టిన ఆ వ్యవహారం ఏమిటో చూద్దాం... 
 

Allu Arjun

టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు అల్లు అర్జున్-స్నేహారెడ్డి. వీరిది ప్రేమ వివాహం. 2011లో స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాడు. విద్యాసంస్థలకు అధిపతి అయిన చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెనే స్నేహ రెడ్డి. 

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ తో స్నేహారెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. అల్లు అర్జున్ తన ప్రేమ విషయం తండ్రి అల్లు అరవింద్ తో చెప్పడంతో ఆయనే స్వయంగా సంబంధం మాట్లాడటానికి వెళ్ళాడట. అయితే చంద్రశేఖర్ రెడ్డి మాత్రం సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వను అన్నారట. 


స్నేహారెడ్డి మాత్రం పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ నే చేసుకుంటానని పట్టుబట్టిందట. దాంతో చేసేది లేక చంద్రశేఖర్ రెడ్డి పెళ్లి కి ఒప్పుకున్నాడట. అల్లు అర్జున్ దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా, అమ్మాయి పేరు అర్హ. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయం షేర్ చేస్తారు. 
 

అయితే అల్లు అర్జున్-స్నేహారెడ్డి మధ్య ఓ విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయట. పిల్లలను గారాబం చేయకూడదు. భయపెట్టాల్సిన సమయంలో భయపెట్టాలని స్నేహారెడ్డి అంటుందట. అల్లు అర్జున్ మాత్రం పిల్లల విపరీతంగా గారాబం చేస్తాడట. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తాడట.

ఇలా చేస్తే పిల్లల్లో స్ట్రాంగ్, ఇండిపెండెంట్ గా ఉండే లక్షణాలు కొరవడతాయి. లైఫ్ లో పోరాడే తత్త్వం కోల్పోతారు. పిల్లలను గారాబం చేసి, సున్నితంగా పెంచకూడదని స్నేహారెడ్డి అంటారట. స్నేహారెడ్డి మాట వినకుండా అల్లు అర్జున్ మితిమీరిన గారాబం చేస్తాడట. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. 

ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్ కి పిల్లలు అంటే ప్రాణం. విరామం దొరికితే వాళ్లతో ఆడుకుంటూ సరదాగా గడుపుతాడు. ముఖ్యంగా కూతురు అర్హతో ఫన్నీ వీడియోలు చేస్తాడు. అల్లు అర్జున్-అర్హ ఫన్నీ వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Latest Videos

click me!