
Guppedantha Manasu 26th March Episode: అనుపమను ఇబ్బంది పెట్టి, ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి.. మను తండ్రి ఎవరో తెలుసుకోవాలని దేవయాణి అనుకుంటుంది, అందులో భాగంగానే మహేంద్ర ఇంటికి వస్తుంది. అనుపమతో మాట్లాడటానికి అడ్డుగా ఉందని.. ఏంజెల్ ని కాఫీ వంకతో పంపిస్తుంది. తర్వాత..ఇక.. అనుపమపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నాకు నిన్ననే తెలిసింది.. మను నీ కొడుకే అంటకదా.. మరి.. నీ భర్త ఎవరు..? ఎక్కడ ఉంటాడు..? బాగానే చూసుకుంటాడా? నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతకాలం అయ్యింది... నీ భర్త ఒక్కసారైనా రాలేదు? నీకు పెళ్లైందనే విషయం కూడా చెప్పలేదు..? కనీసం పెళ్లికి కూడా పిలవలేదు అని అడుగుతుంది.
ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని అనుపమ అంటే,.. కొంపదీసి మను కుంతీ పుత్రుడా అని అడుగుతుంది. ఆ మాటకు అనుపమకు కోపం వచ్చి సీరియస్ గా చూస్తుంది. కానీ.. దేవయాణి ఆపదు. ఎందుకంత కోపంగా చూస్తున్నావ్?. నేను ఇంతకాలం నువ్వు చాల సీరియస్ గా ఉంటావ్ అనుకున్నాను.. కానీ.. నీ జీవితంలోనూ ఓ చీకటి కోణం ఉందని అనుకోలేదు.. మను నీ కొడుకే కదా.. కనీసం.. అతనికైనా తండ్రి ఎవరో తెలుసా అని చాలా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుంది. మీ మాటలు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అని అనుపమ చెబుతున్నా.. దేవయాణి ఆపదు. నీ భర్త పేరు అందరికీ చెప్పడం ఇష్టం లేకపోతే.. నాకు మాత్రమే చెప్పు.. లేదంటే చిన్న క్లూ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది.
అప్పుడే.. వసుధార వచ్చి... మేడమ్ అని అరుస్తుంది. రా వసుధార.. నువ్వు భలే టైమ్ కి వస్తావ్ అని అంటుంది. మీలాంటి వాళ్లు ఉంటే.. టైమ్ కి రావాల్సి వస్తుంది అని వసుధార బదులిస్తుంది. మీరు ఏంటి? అనుపమ మేడమ్ ని ఏధో అడుగుతున్నారు అంటే.. ఏమీ లేదని.. కేవలం.. తన భర్త గురించి అడుగుతున్నాను అని అంటుంది. మీకు ఎందుకు అంటే... వాళ్ల కుటుంబాన్ని భోజనానికి పిలిచి.. చీర పెడదామని అనుకున్నాను అని చెబుతుంది. మీ చేతులు తాకితే..పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది.. అలాంటిది మీ చేతితో చీర ఎందుకులే అని వసుధార అంటుంది.
అప్పుడే ఏంజెల్ కూడా వచ్చి.. కాఫీ ఇస్తుంది. ఇక.. ఏంజెల్, వసుధార ఇద్దరూ కలిసి దేవయాణి పై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇక. ఏంజెల్ వంక పెట్టుకొని నీకు అయినా.. మీ మామయ్య గురించి చెప్పిందా..? మను తనకు బావ కదా.. తనకు అయినా చెప్పి ఉండాలి కదా.. అని అంటుంది. ఇక.. వసుధార కోపంగా దేవయాణిని వెటకారంగా తిడుతుంది. మేడమ్ చెప్పాలి అనుకున్నప్పుడు చెబుతుందని.. మీరు మీ మాటలతో ఇబ్బంది పెట్టొద్దని... మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని.. అసలే ఎండలు కదా అని అంటుంది. ఇక చేసేది లేక.. కోపంగా దేవయాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక... మను వార్నింగ్ తో శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. చాలా ఫ్రస్టేషన్ లో ఉంటాడు. అది గమనించిన ధరణి కావాలనే.. కాఫీ కావాలా అంటూ ఇరిటేట్ చేస్తుంది. వద్దు అని అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అత్తయ్యగారు ఇంకా బయటకు వెళ్లిరాలేదు అని ధరణి చెబుతుంది. అయితే... వాళ్ల అమ్మ కోసం కూర్చొని శైలేంద్ర ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ సమయంలో... ఆ మనుగాడు ప్రతిసారీ తుపాకీ తెచ్చి.. బెదిరిస్తున్నాడని.. మమ్మీ అయినా.. అసలు విషయం తెలుసుకుంటుందో లేదో అని అనుకుంటూ ఉంటాడు.
అప్పుడే దేవయాణి వస్తుంది. మమ్మీ అంటూ సంతోషంగా శైలేంద్ర ఎదురు వెళతాడు. అయితే.. దేవయాణి చెంప పగలకొడుతుంది. నన్నెందుకు కొట్టావ్ మమ్మీ అని శైలేంద్ర అంటే... ఆ వసుధారను కొట్టాలని కొట్టలేక నిన్ను కొట్టాను అని చెబుతుంది. తర్వాత... అనుపమను అడిగావా..? ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. అయితే... ఈ వసుధార వచ్చి చెడగొట్టిందని చెబుతుంది,
తాను అనుపమను చాలా రకాలుగా ప్రశ్నలు వేశాను అని... నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఇంకాస్త సమయం కావాలని.. కొందరిని అడిగి తెలుసుకోవాలి అని అంటుంది, అయితే.. ఆ మను, అనుపమ మాట్లాడుకోకపోవడానికి కారణం మాత్రం నువ్వే కనిపెట్టాలి అని కొడుక్కి చెబుతుంది.
ఇక, ఏంజెల్, వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. మా అత్తయ్య జీవితంలో ఏం జరుగుతోంది అని ఏంజెల్ అని అంటుంది. అనుపమ గతం గురించి... ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా అని ఏంజెల్ అంటుంది. ఎవరికో ఒకరికి నిజం తెలిసే ఉంటుందని ఇద్దరూ అనుకుంటారు. గతంలో రిషి, వసుధారలు కూడా ఒకరికొకరు తెలియని వాళ్లలాగే నటించారని ఏంజెల్ గుర్తు చేస్తుంది. ఇప్పుడు అనుపమ అత్తయ్య కూడా అలానే ప్రవర్తిస్తోందని అంటుంది.
సీన్ కట్ చేస్తే... మనుతో మహేంద్ర మాట్లాడటానికి బయట కలుస్తాడు. అనపమను అమ్మ అని పిలవడానికి ఎందుకు సంకోచిస్తున్నావ్..? అనుపమ కూడా నిన్ను కొడుకులా ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? అని అడుగుతాడు. గతంలో రిషి, జగతిలు కూడా అలానే ఉండేవారని...కానీ.. మీరు ఎందుకు ఇలా ఉంటున్నారో చెప్పమని మహేంద్ర అడుగుతాడు.
అయితే.. తనకు అమ్మ అని పిలిచే అదృష్టం లేదని.. ఆ అవకాశం కూడా అనుపమ ఇవ్వలేదని అంటాడు. ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందని మహేంద్ర అడిగితే... గొడవ జరగలేదని.. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నాం.. ఇప్పుడు అవన్నీ మీకు చెప్పినా ఉపయోగం లేదు అని మను అంటాడు. అయితే... మహేంద్ర.. నేను నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను.. నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పమని అడుగుతాడు. కానీ.. అనుపమ ఒట్టు వేయించుకున్న విషయం గుర్తుకు వచ్చి.. మను చెప్పడానికి ఆలోచిస్తాడు.
సమస్య ఏంటో తెలిస్తే.. దానిని పరిష్కరించుకుంటే.. మీరు సంతోషంగా ఉండవచ్చని మహేంద్ర అంటాడు. అయితే తనకు కూడా పేరెంట్స్ తో సంతోషంగా ఉండాలనే కోరిక ఉందని, కానీ.. ఆ అదృష్టం లేదని... జీవితాంతం తమ సమస్యకు పరిష్కారం దొరకదు అని మను అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.