శిరీష్ భరద్వాజ్ మరణానికి సంబంధించి ఆమె మాట్లాడుతూ, పెళ్లిళ్లు విఫలం కావడంతో చాలా బాధపడ్డాడని, డిస్టర్బ్ అయ్యాడని తెలిపింది. తాగుడుకి బానిస అయినట్టు వార్తలు వస్తోన్న నేపథ్యంలో మరీ అంత తాగేవాడు కాదని, అందరిలాగే తీసుకునేవాడని, దానివల్లే చనిపోయాడనేది నిజం కాదని చెప్పింది. లివర్ పాడైంది, దానివల్లే చనిపోయాడనేది నిజం కాదు, అదంతా ఫాల్స్ న్యూస్ అని, తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. అనారోగ్యంతో ఆయన నెల రోజులకు ముందే జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడట. ఈ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గుండెపోటు వచ్చిందని చెప్పింది.