నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే కారణమా?.. తీన్‌మార్‌ మల్లయ్య సంచలన వ్యాఖ్యలు..

Published : Mar 27, 2024, 09:40 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో పెద్ద దుమారం రేపుతుంది. ఈ క్రమంలో ఇందులో నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఇదే అనే విషయం బయటకు వస్తుంది.  

PREV
17
నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే కారణమా?.. తీన్‌మార్‌ మల్లయ్య సంచలన వ్యాఖ్యలు..
Samantha

టాలీవుడ్‌ జంట నాగచైతన్య, సమంతలో రెండేళ్ల క్రితం తమ విడాకులను ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఈ ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎవరికి వారు తమకు నచ్చినట్టు కామెంట్లు చేస్తూ, తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్‌ డోస్‌ పెంచడమే కారణమన్నారు. 
 

27

సమంత వ్యవహరించే తీరు అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని, పిల్లల విషయంలోనూ చైతూ, సమంత మధ్య ఇష్యూ అయ్యిందన్నారు. మరోవైపు అక్కినేని వ్యాపారాల్లో సమంత జోక్యం చేసుకుంటుందని ఇది కూడా ఈ ఇద్దరు విడిపోవడానికి కారణమని ఎవరికి తోచిన విషయాన్ని వాళ్లు చెబుతూ వచ్చారు. కానీ అసలు విషయం ఏంటనేది మాత్రం ఆ ఇద్దరికి, అక్కినేని ఫ్యామిలీకే తెలియాలి. 
 

37
photo credit- Shanarthi Telangana youtube channel

కానీ ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం అదే అనే విషయం సంచలనం రేపుతుంది. తీన్‌ మార్‌ మల్లన్న ఈ విషయాన్ని చెబుతూ ఆయన షాకింగ్‌ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. రాజకీయ నాయకులు, జడ్జ్ ల ఫోన్‌ నెంబర్లని కూడా ట్యాపింగ్‌ చేశారనే విషయం బయటకు వస్తుంది. ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని, వారి అండదండలతోనే పోలీస్‌ అధికారులు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారనే విషయం డీఎస్పీ కేసు విచారణలో బయటకు వస్తున్నాయి. 
 

47

ఫోన్‌ ట్యాపింగ్‌ కారణం వల్లే టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో, హీరోయిన్‌ విడిపోయారని, మూడు తరాలుగా సినిమాల్లో రాణిస్తున్న ఫ్యామిలీకి చెందిన హీరో, స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే విడాకులు తీసుకున్నారనే ఆరోపణలు వైరల్‌గా మారిన నేపథ్యంలో తాజాగా తీన్‌ మార్‌ మల్లన్న మాత్రం ఆ ఇద్దరు నాగచైతన్య, సమంతనే అని తెలుస్తున్నట్టుగా తెలిపారు. ఈ విషయంపై పూర్తిగా సమాచారం సేకరించి వీడియో చేస్తానని యూట్యూబ్‌ వీడియోలో తెలిపారు. 
 

57
photo credit- Shanarthi Telangana youtube channel

ఈ సందర్భంగా తీన్‌ మార్‌ మల్లన్న మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని, ఆయన మందుల వ్యాపారం చేస్తాడని, ఆయనే ఇదంతా చేశాడని తీర్‌ మార్‌ మల్లన్న వ్యాఖ్యానించడం ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
 

67

దీంతోపాటు మరో స్టార్‌ హీరోయిన్‌ పేరు కూడా ఇందులో వినిపించడం మరింత షాకిస్తుంది. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌కి బలైన వారిలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారనే విషయం పెద్ద దుమారం రేపుతుంది. తమకు అడ్డుగా ఉన్నవారిని, తమకు పోటీగా వస్తున్న వారిని అప్పటి అధికార పార్టీ నాయకులు ఇలా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసేవారని, అందులో సినిమా సెలబ్రిటీలను కూడా బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నట్టు టాక్‌. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

77

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య `తండేల్‌` మూవీలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. చందూ మొండేటి దర్శకుడు. మరోవైపు సమంత గతేడాది సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. త్వరలోనే ఆమె కమ్‌ బ్యాక్‌ కాబోతుందట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories