రోహిత్‌ శర్మ మాస్‌కి `హిట్‌ మ్యాన్‌` సినిమా కరెక్ట్.. స్టార్‌ క్రికెటర్‌పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published | Mar 27, 2024, 8:39 PM IST

రొహిత్ శర్మని హిట్‌ మ్యాన్‌గా పిలుచుకుంటారు ప్రపంచ క్రికెట్‌ అభిమానులు. దాన్ని మరింత పెంచారు విజయ్‌ దేవరకొండ. ఏకంగా సినిమా చేయాలని కామెంట్‌ చేయడం వైరల్‌గా మారింది. 
 

విజయ్‌ దేవరకొండ త్వరలో ఆడియెన్స్ ని పలకరించబోతున్నారు. `ఫ్యామిలీస్టార్‌`గా ఆయన అలరించేందుకు వస్తున్నారు. మాస్‌, క్లాస్‌ని బ్యాలెన్స్ చేస్తూ రచ్చ చేయబోతున్నాడు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే వారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  
 

విజయ్‌ దేవరకొండ లేటెస్ట్ గా హైదరాబాద్‌ స్టార్‌ స్పోర్ట్స్ స్టూడియోకి వెళ్లి సందడి చేశాడు. ఇందులో క్రికెట్‌తో తనకు ఉన్న అనుబంధం, తనకిష్టమైన క్రికెటర్స్, ఐపీఎల్‌ క్రికెట్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఇలా అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్‌ దేవరకొండ. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్‌ అని, ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో సినిమా తీయాలని తెలిపారు. 
 


విజయ్‌ ఏదో యాడ్‌ చూశాడట. అందులో రోహిత్‌ శర్మ మేం డాన్సు చేయమని చెబుతున్నాడట, ఆయన చెబుతున్న తీరు మాస్‌గా ఉందని తెలిపారు. అంతేకాదు తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ ఓ వీడియో చూపించాడట. అందులో రోహిత్‌ శర్మ షాక్‌ అయినట్టు తెలిపారు. అందులో క్రేజీగా వర్కౌట్స్ చేస్తున్నారట. వాటిని సూపర్‌ మ్యాన్‌ పుషప్స్ అంటారని, అవి చేయడం చాలా కష్టం, కానీ చాలా ఈజీగా చేసేస్తున్నాడట, అది చూసి మెంటల్‌ ఎక్కిపోయిందని తెలిపారు విజయ్‌. 
 

రోహిత్‌ శర్మ చాలా ఫిట్‌ ఉంటాడని, అది మామూలు విషయం కాదన్నారు. ఆయనకు పెట్టే టైటిల్‌ రాలేదని, తాను చాలా ఫిట్‌గా ఉంటాడని, మెంటల్లీగా కూడా చాలా స్ట్రాంగ్‌ అని యాంకర్‌గా ఉన్న రవి చెప్పగా, ఆయనకు `హిట్‌ మ్యాన్‌` అనే సినిమా తీస్తే కరెక్ట్ గా సెట్ అవుతుంది. డైలాగ్‌లు ఏమైనా ఇస్తే, రోహిత్‌ శర్మ కొంచెం వాట్‌ లగా దేంగే టైమ్‌, మాట్లాడే విధానం కొంచెం అలా ఉంటుందని, యాటిట్యూడ్‌ ఉంటుందని వెల్లడించారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. 
 

రోహిత్‌ శర్మ టీమిండియాలో స్టార్‌ క్రికెటర్ గా రాణిస్తున్నాడు. ఆయన మొన్నటి వరకు టీమిండియాకి కెప్టెన్‌గా పనిచేశాడు. అలాగే ముంబాయి ఐపీఎల్‌ టీమ్‌కి కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఈ సారి మాత్రమే ఆయన కెప్టెన్సీని వదులుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా కోసం రోహిత్‌ని పక్కన పెట్టింది ముంబయి టీమ్. మొన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఓడిపోవడంతో హార్దిక్‌పై దారుణంగా ట్రోల్ జరుగుతుంది. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఈ ట్రోల్‌ చేయడం గమనార్హం. దీనికితోడు ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేయడంతో వాళ్లు  హ్యాపీగా ఉన్నారు. 
 

ఇక విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` మూవీకి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. రేపు గురువారం ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. 
 

Latest Videos

click me!