Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?

Published : May 25, 2026, 12:53 PM IST

 Ramcharan Controversy: ‘పెద్ది’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే.. చరణ్ మాటలకు బుమ్రా కౌంటర్ ఇచ్చాడా? 

PREV
13
Peddi

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ పెద్ది’. ఈ సినిమా కి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, పాటలు విడుదల కాగా.. మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా... ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగా ఇటీవల భోపాల్ లో మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

23
చరణ్ పొరపాటు...

అయితే, ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ పొరపాటు చేశారు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను ఆయన ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ సంభోధించడం వైరల్ గా మారింది. దీంతో అందరూ రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత తాను చేసిన పొరపాటు గమనించిన చరణ్ స్పందించారు. వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు.తాను పేర్లు మర్చిపోతూ ఉంటానని.. అదొక హ్యుమన్ ఎర్రర్ అని పేర్కొన్నాడు. బుమ్రా అంటే తనకు చాలా అభిమానమని... సారీ కూడా చెప్పాడు.

33
చరణ్ కి బుమ్రా కౌంటర్..?

అయితే... చరణ్.. బుమ్రాని ఫుట్ బాల్ ప్లేయర్ అని అనడంతో.. బుమ్రా హర్ట్ అయ్యి.. చరణ్ కి కౌంటర్ ఇచ్చాడంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఫోటోని షేర్ చేసి ‘ నో ప్రాబ్లం యశ్ భాయ్.. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని.. మీ టాక్సిక్ మూవీ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని రాసి ఉంది. అది బుమ్రానే పోస్టు చేశాడంటూ ఆ ఫోటోని వైరల్ చేయడం మొదలుపెట్టారు. అయితే... నిజానికి అది బుమ్రా పోస్టు చేయలేదు.. ఫ్యాన్స్ అలా క్రియేట్ చేసి వైరల్ చేయడం విశేషం. బుమ్రా ఆ ఫోటో పోస్టు చేయక పోయినా రామ్ చరణ్ కి కౌంటర్ గా.. చాలా మంది మీమర్స్ ఇప్పుడు ఆ ఫోటోని వాడుతుండటం విశేషం.

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఇది భారీ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories