తమిళ సినిమాలోని టాప్ 3 హీరోలైన విజయ్, అజిత్, సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాల్లో నటించింది ఒకే హీరోయిన్. ఆమె వీరికి లక్కీ ఛార్మ్ అని చెప్పొచ్చు. మరి వారికి లైఫ్ ఇచ్చిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
విజయ్, అజిత్, సూర్య.. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ హీరోలు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సీనియర్లని పక్కన పెడితే ఈ ముగ్గురే తిరుగులేని సూపర్ స్టార్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురు డౌన్‌లో ఉన్నప్పుడు లైఫ్ ఇచ్చిందో హీరోయిన్. వీరి అత్యధిక బాక్సాఫీసు హిట్ చిత్రాల్లో హీరోయిన్ మాత్రం ఒక్కరే కావడం విశేషం.
24
ముగ్గురు స్టార్ హీరోల పాలిట లక్కీ ఛార్మ్ త్రిష
తమిళ సినిమా 'బిగ్ త్రీ'గా పిలవబడే దళపతి విజయ్, అజిత్ కుమార్, సూర్య.. ఈ ముగ్గురి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో త్రిషనే హీరోయిన్. ఈ ఆశ్చర్యకరమైన అన్నీ ఒకేలా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు త్రిషను 'బాక్సాఫీస్ లక్కీ రాణి' అని పిలుస్తున్నారు. మరికొందరైతే త్రిషను బాక్సాఫీస్ క్వీన్ అని పొగిడేస్తున్నారు.
34
త్రిష మ్యాజిక్
2023లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా, విజయ్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.605.90 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మెగా హిట్ చిత్రంలో విజయ్‌కు జోడీగా నటించింది మన త్రిషనే. చాలా ఏళ్ల తర్వాత విజయ్-త్రిష జోడీని తెరపై చూసి అభిమానులు తెగ సంబరపడ్డారు. అలాగే, అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.248.25 కోట్లు వసూలు చేసిందని టాక్. ఈ సినిమాలోనూ త్రిషనే మెయిన్ హీరోయిన్. అంతేకాదు, సూర్య నటించిన 'కరుప్పు' సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక్కడ కూడా హీరోయిన్ త్రిషనే.
ఈ ముగ్గురు టాప్ హీరోల కెరీర్ బెస్ట్ చిత్రాల్లో త్రిషనే హీరోయిన్‌గా ఉండటం ఇప్పుడు స్పెషల్. ఆదివారం రోజు, ఓ అభిమాని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "విజయ్ అత్యధిక వసూళ్లు (లియో), అజిత్ అత్యధిక వసూళ్లు (GBU), సూర్య అత్యధిక వసూళ్లు (కరుప్పు)... అన్నింటిలోనూ త్రిష కామన్" అని అందులో రాశాడు. ఇది చూసిన ప్రముఖ నిర్మాత అదితి రవీంద్రనాథ్, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, "ఈ అన్ని మెగా హిట్ సినిమాల కామన్ ఫ్యాక్టర్.. ది వన్ అండ్ ఓన్లీ త్రిష కృష్ణన్" అని మెచ్చుకున్నారు. త్రిష ఈ పోస్ట్‌ను తన పేజీలో రీ-షేర్ చేసి, ఒక అందమైన 'హార్ట్ ఎమోజీ'తో తన ఆనందాన్ని పంచుకుంది. మొత్తానికి, 43 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న త్రిష, కోలీవుడ్ 'అల్టిమేట్ క్వీన్' అని మరోసారి నిరూపించుకుంది.