బండ్ల గణేష్ ఇటీవల షాద్ నగర్‌లో కొత్త ఇంటిని నిర్మించారు. అందులోనే ఉంటున్నారు. అయితే దాని ఖరీదు లీక్ అయ్యింది. రాజా రవీంద్ర ఆ విషయాన్ని లీక్ చేశారు.
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ ఆయన కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. నిర్మాతగా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. కాకపోతే ఈ సారి చిన్నవాళ్లతో, తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నట్టు గతంలో తెలిపారు. తనదైన స్పీచ్‌లతో దుమారం రేపే బండ్ల గణేష్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇటీవల వార్తల్లో నిలిచారు. కాలినడకన తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో మెగా 158 మూవీ ఓపెనింగ్‌లో పవన్, చిరంజీవిలను కలవడం చర్చనీయాంశంగా మారింది.
24
షాద్ నగర్‌లో కొత్తిళ్లు కట్టుకున్న బండ్ల గణేష్
ఈ క్రమంలో బండ్లగణేష్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన గతేడాది కొత్తింట్లోకి వెళ్లారు. గృహ ప్రవేశానికి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, యంగ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. చాలా గ్రాండ్‌గా ఈ గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. చిరంజీవి ఇందులో పాల్గొనడం. ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, బండ్ల గణేష్ పిలుపు మేరకు వెళ్లారు. ఆయన్ని హ్యాపీ చేశారు. చిరంజీవికి కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు గణేష్. ఆయన కోసం ప్రత్యేకంగా చైర్ తయారుచేయించారు. ఇండస్ట్రీకి ఆయనే బాస్, పెద్ద దిక్కు అనేలా ఆయన కుర్చీని తయారు చేయించడం, అందులో ఆయన్నే కూర్చోబెట్టడం విశేషం.
34
బండ్ల గణేష్ ఇంటి విలువ వంద కోట్లు
అయితే ఇంటికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నటుడు రాజా రవీంద్ర ఆ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన బండ్లగణేష్‌ని ఇంటర్వ్యూ చేశారు. తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఇంటిప్రస్తావన రాగా, షాద్ నగర్‌లో నిర్మించిన తన ఇంటి గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. దాని విలువ వంద కోట్లు ఉంటుందట. మీ వంద కోట్ల ఇంటికి చిరంజీవి గారు వచ్చారు. బ్యాక్ పెయిన్‌తోనూ మీపై ప్రేమతో వచ్చారని తెలిపారు. నువ్వు తక్కువోడివి కాదు అని బండ్ల గణేష్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఇంటి ఖరీదుని లీక్ చేశారు రాజా రవీంద్ర. వంద కోట్లతో ఆయన ఈ ఇంటిని నిర్మించడం విశేషం.
అయితే ఇంతటి ఖరీదైన ఇళ్లు మరే హీరోకి లేదని చెప్పొచ్చు. ఈవెన్ ఇండస్ట్రీ పెద్ద, మెగాస్టార్ అయిన చిరంజీవి ఇంటి ఖరీదు కూడా అందులో సగం కూడా ఉండదు. జూబ్లీ హిల్స్ లో ఉండే చిరంజీవి ఇంటి ఖరీదు సుమారు రూ.40కోట్లు ఉంటుందని సమాచారం. మొత్తంగా బండ్ల గణేష్ బిగ్ షాట్ అని చెప్పొచ్చు. ఆయనకు సినిమాలే కాదు, దాన్ని మించిన చాలా వ్యాపారాలున్నాయి. అందులో ఒకటి కోళ్ల ఫామ్‌లు అని సమాచారం.