Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాలో హైలైట్స్ ఇవే

Published : Dec 05, 2025, 10:49 AM IST

Dhurandhar Review: `ధురంధర్` సినిమా థియేటర్లలో అద్భుతమైన ఆరంభాన్ని పొందింది. రణ్‌ వీర్ సింగ్ దేశభక్తి, యాక్షన్‌తో నిండిన పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది.  ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తోంది.    

PREV
14
ధురంధర్‌ మూవీకి ట్విట్టర్‌ రివ్యూ

రణ్‌ వీర్‌ సింగ్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా, ఆర్‌ మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌ నటించిన లేటేస్ట్ మూవీ `ధురంధర్‌`. ఆదిత్య ధార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన ఉందో తెలుసుకుందాం. 

24
మేజర్‌ మోహిత్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ విశ్వరూపం

మేజర్ మోహిత్ పాత్రలో రణ్ వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్సిటితో కూడిన నటనను ప్రదర్శించారు. ప్రతి సన్నివేశంలో ధైర్యం, భావోద్వేగం, శక్తిని నింపారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. యాక్షన్, దేశభక్తి, కథనం అన్నీ అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. 

34
ధురంధర్‌ కథ ఇదే

సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నాల నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. వారి పాత్రలు కథకు మరింత బలాన్ని చేకూర్చాయని విమర్శకులు అంటున్నారు. ఈ సినిమా కథ ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన ఒక రహస్య మిషన్ చుట్టూ తిరుగుతుంది.

44
హైలైట్స్ ఇవే

'ధురంధర్' సినిమా మాస్, క్లాస్ ప్రేక్షకులను ఒకేలా ఆకట్టుకుంటుంది. యాక్షన్, ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్టోరీతో ఇది ఒక పవర్ఫుల్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది. మ్యూజిక్‌, ముఖ్యంగా శాశ్వత్‌ సచ్‌దేవ్‌ బిజీఎం అదిరిపోయింది. అదే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటున్నాయి.  మొత్తంగా సినిమాకి పాజిటివ్ టాక్‌ వినిపిస్తోంది. రణ్‌ వీర్ సింగ్‌ మరో హిట్‌ కొట్టినట్టే అంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories