Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్

Published : Dec 06, 2025, 05:05 PM IST

Dhurandhar Collection: రణ్‌వీర్‌ సింగ్ సినిమా 'ధురంధర్‌' శుక్రవారం రిలీజ్ అయింది. మొదటి రోజే ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.  మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని చెప్పాలి.

PREV
16
బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోన్న ధురంధర్‌ మూవీ

రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన మూవీ `ధురంధర్‌`. డైరెక్టర్ ఆదిత్య ధర్‌ రూపొందించిన ఈ మూవీ శుక్రవారం డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది.  ఈ సినిమా ఫుల్ యాక్షన్-థ్రిల్లర్‌తో నిండి ఉంది. ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.

26
ధురంధర్‌ మూవీ బాక్సాఫీసు రిపోర్ట్

రణ్‌ వీర్ సింగ్ సినిమా `ధురంధర్‌` ఓపెనింగ్ డే కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ ఏడాదికి అదిరిపోయే ముగింపుని ఇవ్వబోతుంది. 

36
ధురంధర్‌ ఫస్ట్ డే కలెక్షన్లు

sacnilk.com రిపోర్ట్ ప్రకారం, రణ్‌వీర్‌ సింగ్ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 27.00 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. హిందీలో సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ 26.44 శాతంగా ఉంది.

46
నెమ్మదిగా పుంచుకుంటోన్న ధురంధర్‌

`ధురంధర్‌` సినిమా ఆక్యుపెన్సీ విషయానికొస్తే, ఉదయం షోలకు 15.49 శాతం, మధ్యాహ్నం షోలకు 28.24 శాతం, సాయంత్రం షోలకు 35.59 శాతంగా ఉంది. మార్నింగ్‌ తో పోల్చితే సాయంత్రానికి బాగా పెరిగింది. ఇది సినిమాపై పాజిటివ్‌ టాక్‌ కి కారణమని చెప్పొచ్చు. క్రమంగా ఇది పుంజుకుంటోంది. సాయంత్రానికి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.

56
బాలీవుడ్‌లో మూడో అతిపెద్ద సినిమాగా ధురంధర్‌

రిపోర్ట్స్ ప్రకారం, రణవీర్ సింగ్ సినిమా `ధురంధర్‌` 2025లో బాలీవుడ్‌లో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. మొదటి స్థానంలో వార్ 2 (రూ.52.5 కోట్లు), రెండో స్థానంలో ఛావా (రూ.31 కోట్లు) ఉన్నాయి.

66
ధురంధర్‌ కాస్టింగ్‌, బడ్జెట్‌

డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన `ధురంధర్‌` రణ్‌ వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మానవ్ గోహిల్, సౌమ్య టాండన్, నవీన్ కౌశిక్, రాజ్ జుత్షీ, బిమల్ ఒబెరాయ్, గీతికా గంజు ధర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమాను రూ.280 కోట్ల బడ్జెట్‌తో తీశారు. దీన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories