Dhurandhar Day 39 Collections: డేంజర్‌ జోన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డులు.. ధురంధర్‌ 39 రోజుల బాక్సాఫీసు వసూళ్లు

Published : Jan 13, 2026, 06:15 PM IST

Dhurandhar Day 39 Collections: `ధురంధర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద ఇంకా రచ్చ చేస్తూనే ఉంది. 39 రోజుల్లో కూడా ఇది మంచి వసూళ్లని రాబడుతోంది. అంతేకాదు ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` కలెక్షన్ల రికార్డులను బ్రేక్‌ చేయబోతుంది. ఒక్క రోజుల్లో దాన్ని దాటేయబోతుంది. 

PREV
15
39 రోజుల్లో 'ధురంధర్' కలెక్షన్ ఎంత?

రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన `ధురంధర్‌` మూవీ ఇంకా బాక్సాఫీజు వద్ద రచ్చ చేస్తోంది. నెల రోజులు  గడిచిపోయినా మంచి వసూళ్లని రాబడుతోంది. 39 రోజుల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్‌ చేసింది. సరికొత్త రికార్డుల దిశగా వెళ్తోంది.

25
'ధురంధర్' KGF చాప్టర్ 2ను వెనక్కి నెట్టింది

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ X పోస్ట్ ప్రకారం, స్పై యాక్షన్ డ్రామా 'ధురంధర్' 39వ రోజు అంటే ఆరో సోమవారం రూ.2.70 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో 39 రోజుల మొత్తం వసూళ్లు రూ.860.10 కోట్లకు చేరాయి. భారతదేశంలో వసూళ్ల పరంగా, యశ్ నటించిన కన్నడ చిత్రం 'KGF చాప్టర్ 2' మొత్తం కలెక్షన్‌ను 'ధురంధర్' అధిగమించింది. 2022లో విడుదలైన ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ఇండియాలో రూ.859.7 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా `ధురంధర్‌` ఏకంగా రూ.1299కోట్లు వసూలు చేసింది. 

35
'ధురంధర్' ముందు అసలైన సవాల్ ఈ రెండు భారతీయ చిత్రాలే

'ధురంధర్' ముందు ఇప్పుడు రెండు భారతీయ చిత్రాలు అసలైన సవాల్‌గా నిలిచాయి. అవి ప్రభాస్ 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్', అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (2017) ఇండియాలో రూ.1030.42 కోట్లు, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2' (2024) రూ.1234.1 కోట్లు నెట్ వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాలు దాటడం కష్టమే. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇది `ఆర్‌ఆర్‌ఆర్‌` ని దాటే అవకాశం కనిపిస్తోంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రపంచ వ్యాప్తంగా 1300కోట్లు దాటింది. 

45
దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 5 భారతీయ చిత్రాలు
  1. పుష్ప 2: ది రూల్ (తెలుగు): 1234.1 కోట్లు
  2. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (తెలుగు): 1030.42 కోట్లు
  3. ధురంధర్ (హిందీ): 860.10 కోట్లు
  4. RRR (తెలుగు): 782.2 కోట్లు
  5. కల్కి 2898 AD (తెలుగు): 646.31 కోట్లు
55
ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్' కలెక్షన్ ఎంత?

39 రోజుల తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.1299.56 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో ఇది ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 5 చిత్రాలు ఇవే...

  1. దంగల్ (హిందీ): 1968.03 కోట్లు
  2. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (తెలుగు): 1788.06 కోట్లు
  3. పుష్ప 2: ది రూల్ (తెలుగు): 1742.1 కోట్లు
  4. ధురంధర్ (హిందీ): 1299.56 కోట్లు
  5. RRR (తెలుగు): 1230 కోట్లు.                                                                                                          ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ ని ఒక్క రోజుల్లోనే `ధురంధర్‌` దాటేస్తుందని చెప్పొచ్చు. దీంతో అత్యధిక వసూళ్లని రాబట్టిన నాల్గో మూవీగా ఈ సినిమా నిలవబోతుంది. 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories