నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?

Published : Jan 13, 2026, 04:36 PM IST

చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ యంగ్ హీరో నటించిన నారి నారి నడుమ మురారి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఫస్ట్ టైమ్ శర్వానంద్ మూవీకి అడల్ట్ ఫ్లేవర్ తగిలినట్టు తెలుస్తోంది. సెన్సార్ చిక్కులను ఈసినిమా ఎలా దాటింది. మూవీ ఎలా ఉంది? 

PREV
15
నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారి. ఈసినిమా సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రాడానికి సిద్ధమవుతోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శర్వానంద్ ఈసినిమాతో సక్సెస్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

25
శర్వానంద్ ఘాటు రొమాన్స్..

శర్వానంద్ తో పాటు సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను లాంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాకు భాను భోగవరపు కథను అందించగా, నందు సావిరిగన మాటలు రాశారు. కామెడీ ప్రధానంగా ఈసినిమాను తెరకెక్కించారు.

ఇద్దరు ఆడవారి మధ్య నలిగే ప్రేమికుడి పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారు. గతంలో గుడ్ బాయ్ గా ఉన్న శర్వానంద్.. ఈసారి కాస్త ఘాటు రొమాన్స్ చేసినట్టు తెలుస్తోంది. సెన్సార్ నుంచి అభ్యంతరం వచ్చేవిధంగా శర్వానంద్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈసినిమాకు స్పెషల్ అని చెప్పవచ్చు.

35
సెన్సార్ సభ్యుల అభ్యంతరాలు

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న టైమ్ లో.. మెగా మూవీకి పోటీగా దిగే సాహసం చేస్తున్నాడు శర్వానంద్. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సమయంలో సినిమాలోని కొన్ని అడల్ట్ ఫ్లేవర్ ఉన్న డైలాగ్స్‌, సీన్స్ పై స్వల్ప అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం. సెన్సార్ అధికారులు సూచించిన మార్పులు, సలహాలను పాటించి అవసరమైన సవరణలు కూడా మేకర్స్ చేశారట.

45
నారి నారి నడుమ మురారి సినిమాకు సెన్సార్ పూర్తి..

ఇక నారి నారి నడుమ మురారి సినిమాకు సెన్సార్ అధికారులు యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను చూడవచ్చు.. 13 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సినిమా చూడాల్సి ఉంటుంది. ఇక ఈసినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే.. ఎక్కువ లెన్త్ లేకుండా.. ఆడియన్స్ కు బోర్ కొట్టించకుండా.. సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు మేకర్స్. మూవీ రన్ టైమ్ కూడా.. 2 గంటల 25 నిమిషాలు వచ్చినట్టు తెలుస్తోంది.

55
కామెడీ హైలెట్ అవ్వబోతోందా?

సెన్సార్ అనంతరం వచ్చిన సమాచారం ప్రకారం, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయని, ఎమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై పాజిటివ్ బజ్‌ను పెంచింది. భారీ సినిమాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ మధ్య కొట్టుమిట్టాడుతున్న శర్వాకు.. ఈసినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories