Poorna killing in black : స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో `ఢీ` పూర్ణ హాట్‌ షో.. పిచ్చెక్కిస్తున్న నాటీ లుక్స్

Published : Jan 05, 2022, 10:35 AM ISTUpdated : Jan 05, 2022, 04:35 PM IST

`అఖండ` చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకున్న `ఢీ` పూర్ణ గ్లామర్‌ షూట్లతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న గ్లామర్‌ పిక్స్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
16
Poorna killing in black : స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో `ఢీ` పూర్ణ హాట్‌ షో.. పిచ్చెక్కిస్తున్న నాటీ లుక్స్

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై విభిన్నమైన గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన పూర్ణ(Purna).. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది Purna. హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే పూర్ణ ఇలా బ్లాక్‌లో మెరిస్తే మామూలుగా ఉంటుందా? హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అయ్యిందని అంటున్నారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం పూర్ణ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

26

హీరోయిన్‌గా తెలుగు తెరపై కనువిందు చేసిన పూర్ణ `అవును` సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. పూర్ణ సినిమాల  ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఆమె కెరీర్‌ గాడి తప్పింది. కేవలం చిన్న చిత్రాలకే పరిమితమయ్యింది. 

36

ఈ నేపథ్యంలో `ఢీ`(Dhee Purna) షో పూర్ణకి లైఫ్‌ ఇచ్చిందని, ఆమె కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ` ఢీ` షోతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. బుల్లితెరపై ఆమెకి సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. విపరీతమైన క్రేజ్‌ సొంతమైంది. అదే సమయంలో సినిమాల పరంగానూ ఆమెకి బిగ్‌ టర్న్‌ తీసుకునేలా చేసిందని చెప్పొచ్చు. 
 

46

ఇటీవల `తలైవి`, `దృశ్యం2`, `అఖండ` చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది పూర్ణ. `తలైవి`లో శశికళగా మెప్పించింది. పాత్రకి ప్రాణం పోసింది. మరోవైపు `దృశ్యం2`లో ఫస్ట్ టైమ్‌ లాయర్‌గా మెప్పించింది. కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకుంది పూర్ణ. మరోవైపు `అఖండ` చిత్రంలో అధికారిగా అలరించింది. హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌కి సబార్డినేట్‌గా కీలక పాత్రలో కనిపించింది. అదే సమయంలో తన తాలుకూ బోల్డ్ రోల్‌ చేసింది పూర్ణ. ఇందులో రేప్‌కి గురైన సన్నివేశంలో నటించి తన డేరింగ్‌ స్టెప్‌ని చాటుకుంది. 
 

56

ఇదిలా ఉంటే `ఢీ` షోలో జడ్జ్ గా మెరిసిన పూర్ణ.. ఇప్పుడు దాన్నుంచి తప్పుకుంది. `ఢీ14` వ సీజన్‌ నుంచి పూర్ణ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె అభిమానులు మాత్రం పూర్ణ తిరిగి రావాలని కోరుకోవడం, డిమాండ్‌ చేయడం విశేషం. ఆమెకి బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో తెలియజేస్తుందని చెప్పొచ్చు. 
 

66

ప్రస్తుతం పూర్ణ.. తెలుగులో `బ్యాక్‌డోర్‌`, `తీస్‌మార్‌ ఖాన్‌`తోపాటు తమిళంలో `పడమ్‌ పెసుమ్‌`, `పిసాసు2`, `అమ్మాయి`, `విసిథ్తిరమ్‌`, మలయాళంలో `వృతమ్‌` చిత్రాలు చేస్తుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో పూర్ణ నటించబోతుందని, సినిమాల్లో బిజీగా ఉండటం వల్లే `ఢీ` నుంచి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె స్థానంలో నందిత శ్వేత జడ్జ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. 

also read: Mahesh-Allu Arjun: దిగొచ్చిన మహేష్‌.. ఐకాన్‌స్టార్‌తో వివాదానికి చెక్‌ పెట్టినట్టేనా?.. బన్నీ స్వీట్‌ పోస్ట్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories