#NeneVasthunna:ధనుష్ 'నేనే వస్తున్నా' రివ్యూ

First Published | Sep 29, 2022, 1:31 PM IST

గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తెలుగులో ధనుష్ తాజా చిత్రం 'నేనే వస్తున్నా'   విడుదలైంది. ఇది తమిళ్  సినిమా   Naane Varuven ని తెలుగుకి డబ్బింగ్ . ఈ సినిమా ఎలా ఉంది? 


ఒకప్పుడు ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రాలు తెలుగులో డబ్ చేసి వదిలేవారు. అవి ఇక్కడ కూడా సక్సెస్ సాధించేవి. ముఖ్యంగా ఆ సినిమాలన్నీ కథా బలం కలిగినవి కావటంతో డబ్బింగ్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకుడు ఆసక్తి చూపించేవారు. అయితే ఆ తర్వాత ఒక హీరో సినిమా ఏదైనా హిట్టైతే వరస పెట్టి ఆ హీరో సినిమాలు అన్ని డబ్ చేసి గబ్బు లేపేవారు. అలా ఆ తమిళ హీరోలను ఇక్కడ అలావాటు చేసే ప్రయత్నం జరిగింది. చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలా తెలుగువారు గుర్తు పట్టే హీరో ధనుష్. అతని సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా తిరుతో డీసెంట్  హిట్ కొట్టిన ధనుష్ ..లేటెస్ట్ ఫిల్మ్ ఎలా ఉంది...హిట్ అవుతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 


కథాంశం:

ప్రభు (ధనుష్) తన కవల సోదరుడు ఖదీర్ (రెండో ధనుష్) తో విడిపోతాడు. అందుకు కారణం  ఖదీర్ చిన్న తనం నుంచి సైకో లా బిహేవ్ చేయటమే.  ముప్పై ఏళ్ల తర్వాత ఈ కథలోకి మళ్లీ ఇద్దరు కలిసే సందర్బం వస్తుంది. అప్పటికి  ప్రభు ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూంటాడు.  తన కూతురు సత్య, భార్యతో చాలా  హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు.  అది చూసి అతని తోటి ఉద్యోగస్దులు (యోగిబాబు) అసూయపడుతూంటారు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అతని కూతురు ఎవరో  కంటికి కనపడని మనిషిని చూడటం, మాట్లాడటం చేస్తూంటుంది. కంగారుపడ్డ ప్రభు..ఆమెను ఓ సైక్రాటిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లినా ఫలితం ఉండదు. కొంతమంది పారానార్మల్ యాక్టివిస్ట్ లను పిలిపించి ఈ సమస్యకు ఓ పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తాడు. 
 



ఆ క్రమంలో ఓ షాకింగ్ విషయం బయటపడుతుంది. తన కూతురు వెనక సోను అనే దెయ్యం పడుతోందనే విషయం అర్దమవుతుంది. అది చాలా టార్చర్ పెడుతూంటుంది. ఆ దెయ్యం ఓ వింత కోరిక కోరుతుంది. తన తండ్రి అయినటువంటి ఖథిర్ (ధనుష్ )ని చంపితేనే ఆ పాపని వదిలిపెడతానని కండీషన్ పెడుతుంది.  ఇంతకీ ఈ ఖథిర్ ఇప్పుడు  ఎక్కడున్నాడు...ప్రభు తన కూతురు జీవితం కోసం తన సోదరుడునే చంపుతాడా...అసలు ఇలాంటి కోరిక ఆ దెయ్యం ఎందుకు అడిగింది..ఆ సోనూ దెయ్యం ఎవరు ...చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...

ఇదో థ్రిల్లర్ జానర్ లో నడిచే స్క్రిప్టు. థ్రిల్లర్స్ ఎక్కువగా డార్క్ మూడ్ లో , హై స్టేక్స్ తో సస్పెన్స్ తో కూడిన ప్లాట్ డ్రైవన్ కథలుగా రూపొందుతాయి. ముఖ్యంగా ఊహించని ట్విస్ట్ లు ఇలాంటి కథలకు ప్రాణం. అడుగడక్కీ టెన్షన్ ఎలివేట్ చేయగలగాలి. చూసేవారిని ఎంగేజింగ్ గా ఉంచటం పాటు ఎక్సైట్మెంట్ కు గురి చేయాలి. సస్పెన్స్ ఇంట్రట్స్ తగ్గినా, సీన్స్ లో ఇంటెన్స్  తగ్గినా జనం అబ్బే ఏం లేదు అనేస్తారు. ఇక ఈ సినిమా ఫస్టాఫ్ లో దాదాపు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అంతేకాదు హారర్ ని కూడా మిక్స్ చేసి అదిరిపోయే ఇంటర్వెల్ ఇచ్చారు. కానీ సెకండాఫ్ ని నడపటంలో తడబడిపోయారు. అయితే సినిమా ఎంగేజ్ చేయగలిగింది చాలా వరకూ. అందుకు కారణం నెగిటివ్ షేడ్స్ తో ఉన్నఖదీర్  క్యారక్టర్ ని ఎమోషన్స్ నేపధ్యం, నిలువల్లా క్రూరత్వంలా డిజైన్ చేసారు. ఓ సైకోలా ఆ పాత్ర ప్రవరిస్తూండటంతో తర్వాత ఏం జరుగుతుందని ఎదురుచూస్తాము. ఆ క్యారక్టర్ కు ఉండే ఇంటర్నెల్ లాజిక్ మనను పూర్తి గా సాటిస్పై చేయకపోవటం కాస్తంత ఇబ్బందే.  The Silence of the Lambs స్దాయి నటన ధనుష్ చూపించాడు. కానీ స్క్రిప్టు ఆ స్దాయిలో లేదు. క్యారక్టర్ డవలప్మెంట్  చేయకుండా,  ట్విస్ట్ లకు ప్రయారిటీ ఇచ్చారు. 


అలాగే కొంత దూరం వెళ్లాక ప్రధాన పాత్ర ప్రభుకి అడ్డంకులు కనపడవు. అసలు కథ అతని వైపు నుంచి జారి రెండో పాత్ర ఖదీర్ వైపు వెళ్తుంది. అయితే ఆ రెండు పాత్రలు చేసింది తనే కదా అని ధనుష్ అనుకుని ఉండచ్చు. కానీ మొయిన్ పాత్రనే కదా ప్రేక్షకుడు ఫాలో అయ్యేది. ఆ పాత్రను వదిలేస్తే కథ డైరక్షన్ లెస్ గా సాగుతుంది. అయితే ఇందులో నచ్చే విషయం...కాన్సెప్టు ని నమ్మారు కానీ జిమ్మిక్స్ కాకపోవటం. అలాగే చాలా భాగం టెన్షన్ పాయింట్ ని ఎలివేట్ చేయాలని ప్రయత్నించటం. అయితే ఈ కథ ఓ టైమ్ కు వచ్చేసరికి హారర్  సినిమా చూస్తున్నామా లేక థ్రిల్లర్ సినిమానా ..ఇవన్నీ కాకుండా మామూలు ఇద్దరి ట్విన్స్ కథ చూస్తున్నామా అనే సందేహం వస్తుంది. స్క్రీన్ ప్లే సమస్యతో ఈ సినిమా సెకండాఫ్ మొత్తం మనని ఇబ్బంది పెడుతూంటుంది. విసిగిస్తుంది. ఫస్టాఫ్ కే పస మొత్తం అయ్యిపోయిందనిపిస్తుంది. సెంకాడాఫ్ లో కథ నడుస్తూంటే ఫలానా రకంగా జరుగుతుందని మనం ఊహించుకుంటూ, గ్రిప్ లేకుండా నడిచే సీన్స్ ని , సెల్ ఫోన్ లో మెసేజ్ లు చదువుకుంటూ చూస్తూంటాం.  ఓవరాల్ గా చూస్తే కొత్త కధా కాదు. ఎందుకంత ఎక్సైట్ అయ్యి ఈ సినిమా తీసారా అని ఆశ్చర్యం వేస్తుంది.
  


టెక్నికల్ గా ...

ఇలాంటి సినిమాలకు ప్రధానంగా ప్లస్ గా నిలిచేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్. దర్శకత్వం. సంగీతం యవన్ శంకర్ రాజా తన పని తాను చేసుకుంటూ పోయారు. కెమెరావర్క్ ఓం ప్రకాష్  కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా భాగం లాగ్ లు లేకుండా లాగారు. అయితే సెంకండాఫ్ ఆయన చేతులెత్తేసినట్లున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చెప్పించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సెల్వ రాఘవన్ దర్శకుడుగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. మరేంటి సమస్య అంటే స్క్రిప్టే ఈ సినిమాలో ఉన్న సోల్ ని చంపేసే పోగ్రాం పెట్టుకుంది. 

నటీనటుల్లో .... ధనుష్ తను రాసుకున్నకథలో తన పాత్రను ఎంతకాలం ఊహించుకున్నాడో ఏమో కానీ అదరకొట్టాడు. ఖదీర్ పాత్రలో నిజంగా ఓ సైకోలా అనిపించాడు. అయితే అన్నదమ్ముల ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే కిక్ కానీ, ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవటం కానీ లేదు. ధనుష్ ఫెరఫార్మెన్స్ చూసి మురిసిపోవాలి తప్ప సినిమాగా చూస్తే పెద్దగా నచ్చదు.  యోగిబాబు కామెడీ కొంతవరకూ వర్కవుట్ అయ్యింది. ఎలీ అవ్రామ్ మరో సారి తనేంటో చూపించింది.


నచ్చనవి :

ధనుష్  ఫెరఫార్మెన్స్ 

కూతురు తో సాగే ఎమోషన్స్ 
ఇంటర్వెల్  

 
నచ్చనవి :

స్లో నేరేషన్
 
బోర్ గా సాగే సెకండాఫ్

విసుగెత్తించే యాక్షన్ సీన్స్.


ఫైనల్ థాట్:

కొన్ని ట్విస్ట్ లు అనుకున్నప్పుడు థ్రిల్ చేసేస్తాయి. నమ్మి  దాని  చుట్టూ కథ అల్లటం మొదలెడితే మాత్రం తీసినోడికి ,చూసినోడికి హారరే. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5


నటీనటులు : ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, ప్రభు, యోగిబాబు, సెల్వరాఘవన్, షెల్లీ కిశోర్, శరవణ సుబ్బయ్య తదితరులు
కథ : సెల్వరాఘవన్, ధనుష్ 
ఛాయాగ్రహణం : ఓం ప్రకాశ్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సమర్పణ : గీతా ఆర్ట్స్ (తెలుగులో)
నిర్మాత : కలైపులి ఎస్. థాను 
దర్శకత్వం : సెల్వరాఘవన్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 29, 2022
 

Latest Videos

click me!