సౌత్‌లో రీమేక్ అయిన ధర్మేంద్ర సినిమాలు.. తెలుగులో బ్లాక్‌ బస్టర్స్ అందుకున్న ఎన్టీఆర్‌, కృష్ణ, కృష్ణంరాజు

Published : Nov 24, 2025, 06:11 PM IST

Dharmendra: ధర్మేంద్ర చాలా సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యాయి, అవన్నీ హిట్టే. `ఫూల్ ఔర్ పత్తర్` నుంచి `గజబ్ దాకా` దాదాపు ఐదు సినిమాలు సౌత్‌లో రీమేక్‌ అయ్యాయి. అందులోనూ తెలుగులో ఎన్టీఆర్‌, కృష్ణ, కృష్ణంరాజులు సూపర్‌ హిట్స్ అందుకున్నారు.   

PREV
16
`ఫూల్ ఔర్ పత్తర్ తెలుగులో `నిండు మనుసులు`గా రీమేక్‌

ధర్మేంద్ర సినిమా `ఫూల్ ఔర్ పత్తర్` 1966లో రిలీజైంది. ఈ మూవీ బాలీవుడ్‌లో పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో రీమేక్‌ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా `నిండు మనుసులు`గా రీమేక్‌ అయి హిట్‌ అయ్యింది. దీంతోపాటు తమిళం `ఓలి వల్లకు`గా,  మలయాళంలో `పుతియా వల్లిచమ్‌`గా రీమేక్‌ అయ్యింది. అక్కడ కూడా హిట్‌ అయ్యింది. 

26
`సీతా ఔర్ గీతా` తెలుగులో `గంగా మంగా`గా రీమేక్‌

ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా సీతా ఔర్ గీతా 1972లో రిలీజైంది. హిందీలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీని తెలుగులో కృష్ణ మోహన్‌ బాబు `గంగా మంగా`గా రీమేక్‌ చేశారు. అయితే ఇది ఎన్టీఆర్‌ నటించిన `రాముడు భీముడు`కి రీమేక్‌ కావడం విశేషం. ఇక ఈ సినిమా  తమిళంలో వాణి రాణి (1974)గా వచ్చింది. రెండూ బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి.

36
`ఇన్సాఫ్ కీ పుకార్` తెలుగులో `గురు శిష్యులు`గా రీమేక్‌

ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా ఇన్సాఫ్ కీ పుకార్ 1987లో రిలీజైంది. అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. దీన్ని కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్‌ కలిసి `గురు శిష్యులు`గా రీమేక్‌ చేశారు. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.

46
షోలే

ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్‌ల సినిమా షోలే 1975లో రిలీజైంది. దీని సౌత్ రీమేక్  తమిళంలో రక్త కన్నీరు (1974)గా వచ్చింది.  తెలుగులో రీమేక్‌ కాలేదు. కానీ ఇందులోని గబ్బర్‌ సింగ్‌ పాత్ర ఆధారంగా `గబ్బర్‌ సింగ్‌` మూవీని రూపొందించారు. కాకపోతే ఇది `దబాంగ్` కి రీమేక్‌. ఆ తర్వాత హిందీలోనే వర్మ `ఆగ్‌` పేరుతో రీమేక్‌ చేసి చేతులు కాల్చుకున్నారు.

56
రాజ్‌పుత్

ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా రాజ్‌పుత్ 1982లో రిలీజైంది. తెలుగులో రాజ్‌పుత్ (1983) డబ్‌ అయి ఆకట్టుకుంది. తమిళంలో రాజవంశం (1983)గా రీమేక్‌ అయ్యింది. రెండు చోట్లు ఆకట్టుకుంది.

66
గజబ్

ధర్మేంద్ర, రేఖల సినిమా గజబ్ 1982లో రిలీజైంది. ఇది హిందీలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తమిళంలో వచ్చిన `కళ్యాణరామన్‌` చిత్రానికి రీమేక్‌ కావడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories