Dharmendra Family: ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న కన్నుమూశారు. ఆయన తన తర్వాత పెద్ద కుటుంబాన్నే విడిచి వెళ్లారు. మరి ఆయన కుటుంబంలో ఎవరున్నారు, వాళ్లేం చేస్తారో తెలుసుకుందాం.
బాలీవుడ్ నట దిగ్గజం, లెజెండరీ నటుడు, అందగాడు ధర్మేంద్ర కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ఫ్యామిలీ విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వారసులుగా ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంతేకాదు ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ధర్మేంద్రకు ప్రకాశ్ కౌర్(1954)తో పెళ్లయింది. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు. ప్రకాశ్ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. వీరికి సన్నీ, బాబీ, విజేతా, అజీతా అనే నలుగురు పిల్లలు.
28
స్టార్ హీరోయిన్ హేమా మాలినితో రెండో పెళ్లి
ధర్మేంద్ర మంచి అందగాడు. రొమాంటిక్ హీరో కూడా. దీంతో ఎంతో మంది హీరోయిన్లు ఆయన వెంటపడేవారు. వెంట పడేలా చేసుకునేవారు. ఈ క్రమంలో అప్పటి స్టార్ హీరోయిన్ హేమా మాలినిపై మనసు పడింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయింది. అందుకే ఆయన మతం మార్చుకుని హేమను పెళ్లి చేసుకున్నారు.
38
ధర్మేంద్ర పెద్ద కుమారు సన్నీ డియోల్
ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ పాపులర్ యాక్టర్. ఆయన భార్య పూజా డియోల్. వీరికి కరణ్, రాజ్‌వీర్ అనే ఇద్దరు కొడుకులు. కరణ్ 2023లో దిశాను పెళ్లి చేసుకున్నాడు. రాజ్‌వీర్ నటనలో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సన్నీ డియోల్ ఇటీవల తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో `జాట్` మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇది మంచి ఆదరణ పొందింది.
ధర్మేంద్ర రెండో కుమారుడు బాబీ డియోల్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు విలన్‌గా టర్న్ తీసుకున్నారు. `యానిమల్` మూవీ ఆయన కెరీర్‌నే మార్చేసింది. దీంతో ఇప్పుడు విలన్‌గా బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో `డాకు మహారాజ్`, `హరి హర వీరమల్లు` చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. బాబీ డియోల్ భార్య పేరు తాన్యా డియోల్. వీరికి ఆర్యమన్, ధరమ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. సినిమాలకు దూరంగా ఉన్నారు.
58
సినిమాలకు దూరంగా ధర్మేంద్ర కూతురు విజేతా డియోల్
ధర్మేంద్ర కూతురు విజేతా డియోల్ భర్త పేరు వివేక్ గిల్. వీరికి కొడుకు సాహిల్, కూతురు ప్రేరణ ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం, వారు ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈమె కూడా సినిమా ప్రపంచానికి దూరంగానే ఉంటున్నారు.
68
ధర్మేంద్ర మరో కూతురు అజీతా డియోల్
అజీతా డియోల్ తన కుటుంబంతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటారు. ఆమె అక్కడ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్ చౌదరి. ఈ దంపతులకు నికిత, ప్రియాంక చౌదరి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు కూడా పెద్దగా పబ్లిక్‌లో కనిపించారు. పూర్తి ప్రైవేట్ లైఫ్‌నే గడుపుతున్నారు.
78
నటిగా రాణిస్తోన్న ఇషా డియోల్
ధర్మేంద్ర ఫ్యామిలీ నుంచి లేడీ వారసులుగా నటి ఈషా డియోల్ రాణిస్తున్నారు. ఈమెకి భరత్ తఖ్తానీతో పెళ్లయింది. కానీ 2024లో విడిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిని ఇద్దరూ కలిసి పెంచుతున్నారు.
88
అహానా డియోల్
అహానా డియోల్ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. 2014లో వ్యాపారవేత్త వైభవ్ వోహ్రాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కవల కూతుళ్లు, మొత్తం ముగ్గురు పిల్లలు.