Dharmendra in Heaven AI Video : స్టార్ నటుడు ధర్మేంద్ర చనిపోయాక స్వర్గానికి వెళ్లారు.. అక్కడ తన స్నేహితులను కలుసుకున్నారు, అందరు కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానుల హృదయాలను కదిలించివేసిన ఏఐ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24 న కన్నుమూశారు. ఆయన నటించిన షోలే సినిమా 50వ వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలోనే ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధించింది. బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
26
బాలీవుడ్ కోల్పోయిన నలుగురు ప్రముఖులు
అయితే, ఈ ఏడాది బాలీవుడ్ నలుగురు ప్రముఖులను కోల్పోయింది. వారి మరణంతో అభిమానులకు చాలాపెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. ధర్మేంద్ర మరణానికి ముందు, ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటులు కన్నుమూశారు.
36
బాలీవుడ్‌కు అక్టోబర్ షాక్
ప్రముఖ హాస్యనటులు సతీష్ షా, గోవర్ధన్ అస్రానీ, మహాభారతంలో కర్ణుడి పాత్రతో ఫేమస్ అయిన నటుడు పంకజ్ ధీర్ అక్టోబర్‌లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.అక్టోబర్ 15న పంకజ్ ధీర్, అక్టోబర్ 20న గోవర్ధన్ అస్రానీ, 25న సతీష్ షా మరణించారు.
ఇక ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా వీరు స్వర్గంలో కలుసుకున్నారు. ధర్మేంద్రకు వారు స్వగతం పలికారు. తమ స్నేహితుడితో కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. అంతా కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేశారు. అయితే ఇదంతా ఏఐ మాయాజాలం చేసిన అద్భుతం.
56
ధర్మేంద్ర ఏఐ వీడియో
తాజాగా ఈ నటులందరూ స్వర్గంలో కలుసుకున్నట్లుగా ఒక ఏఐ వీడియోను రూపొందించారు. ధర్మేంద్ర ఆసుపత్రి మంచం మీద నుంచి లేచి స్వర్గానికి వెళ్తుండగా, గత నెలలో మరణించిన నటులు ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు వీడియోలో ఉంది.
66
అభిమానుల ఎమోషనల్ కామెంట్స్..
ఇక్కడ ఈ నలుగురు నటులు కలిసి మాట్లాడుకుంటున్నట్లు కనిపించిన వీడియో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నిజంగా ధర్మేంద్ర స్వర్గంలో తమ స్నేహితులతో సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఈ వీడియో పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.