రోజా కన్నతండ్రి కంటే ఎక్కువగా అభిమానించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

Published : Nov 24, 2025, 02:33 PM IST

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రోజా.. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయిపోయింది. తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని ఇమేజ్ సాధించిన రోజా.. ఇండస్ట్రీలో కన్నతండ్రికంటే ఎక్కువగా అభిమానించే సీనియర్ హీరో ఎవరో తెలుసా? 

PREV
14
రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ గా..

టాలీవుడ్ లో 90వ దశకంలో దూసుకుపోయింది రోజా సెల్వమణి. తెలగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జు, వెంకటేష్, సుమన్, జగపతిబాబు లాంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. ఇక తమిళంలో కూడా ఆల్మోస్ట్ స్టార్స్ అందరిజతగా నటించింది రోజా. టాలీవుడ్, కోలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. హీరోయిన్ గా కెరీర్ కంప్లీట్ అయిన తరువాత కొన్ని సినిమాల్లో మాత్రమే ఆమె హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపించారు. ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు రోజా. అంతే కాదు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసింది.

24
బుల్లితెరపై నవ్వుల రోజా..

పాలిటిక్స్ లో కొనసాగుతూనే.. రోజా బుల్లితెరపై కూడా సందడి చేసింది. జబర్థస్త్ కామెడీ షోకు నాగబాబుతో పాటు జడ్జ్ గా చేసింది. జబర్థస్త్ కు లాంగ్ టైమ్ జడ్జిగా రికార్డు క్రియేట్ చేసింది రోజా. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆమె జబర్థస్త్ లో కొనసాగింది. మధ్యలో నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నా కానీ.. రోజా మాత్రం మంత్రి అయ్యేవరకూ ఈ షోలో కొనసాగింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం రూల్స్ ప్రకారం షోలో ఉండకూడదు కాబట్టి.. జబర్థస్త్ కు గుడ్ బై చెప్పింది. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో.. మరోసారి బుల్లితెరపై ఇతర షోలలో సందడి

చేస్తోంది రోజా.

34
తండ్రిలా అభిమానించే హీరో..

రోజా తెలుగులో నటించిన రెండో సినిమా సర్పయాగం. ఈసినిమాలో ఆమె శోభన్ బాబు కూతురిగా నటించి మెప్పించింది. అప్పటికి రోజా వయసు 17 ఏళ్లు మాత్రమే. షూటింగ్ టైమ్ లో శోభన్ బాబుతో మంచి అనుబంధం ఏర్పడింది రోజాకు. ఆయన కూడా రోజాను సొంత కూతురికంటే ఎక్కువగా చూసుకునేవారు. రోజాది చిత్తూరు కావడంతో.. ఆ యాసలో ఎక్కువగా మాట్లాడేది. అది వారికి విచిత్రంగా అనిపించి, మళ్లీ మళ్లీ ఆ మాటలు మాట్లాడించుకుని నవ్వుకునేవారు శోభన్ బాబు. ఒక్క సినిమాతో రోజా శోభన్ బాబు మధ్య తండ్రీ కూతుర్ల అనుబంధం బలపడింది. ఈ సినిమా తరువాత కూడా వారు అదే ప్రేమను కొనసాగించారు. ఈ విషయాన్ని రోజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

44
శోభన్ బాబును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న రోజా..

శోభన్ బాబు గురించి తెపుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా. ఆమె మాట్లాడుతూ..'' శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో ఎవరితో కలగలేదు. నన్ను సొంత కూతురిలా చూసుకునేవారు. అంతే కాదు శోభన్ బాబు చనిపోయారని తెలిసి తట్టుకోలేకపోయాను. అప్పుడు పనిమీద ఢిల్లీ వెళ్లాను.. ఈ విషయం తెలిసిన వెంటనే.. నేను నాన్న పరుగెత్తుకుంటూ చెన్నై వచ్చేశాము. ఆయన్ను అలా చూసేసరికి ఏడుపు ఆపుకోలేకపోయాను. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఎవరిని హార్ట్ చేయరు. ఎవరిని ఒక్క మాట అనరు. డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అని అందరికి చెపుతుంటారు. చాలా మంచి వ్యక్తి '' అని రోజా అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories