తమిళనాడు సీఎం దళపతి విజయ్ అభిమానుల వల్లే తనకు గర్భస్రావం అయిందని బిగ్‌బాస్ ఫేమ్, నటి జూలీ సంచలన ఆరోపణలు చేశారు. ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే తన బిడ్డను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్, మాజీ నర్సు, నటి మరియా జూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు గర్భస్రావం కావడానికి తమిళనాడు ముఖ్యమంత్రి, సౌత్ స్టార్ దళపతి జోసెఫ్ విజయ్ కారణమని ఆమె ఆరోపించారు.
25
సీఎం విజయ్ పై ఆరోపణలు..
రీసెంట్ గా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో నటి జూలీ మాట్లాడారు. తమిళనాడు సీఎం విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సపోర్టర్స్ వేధింపుల వల్లే తనకు గర్భస్రావం అయిందని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో గత మార్చిలో 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె చెప్పారు.
35
గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు?
టీవీకే సపోర్టర్స్ తనను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి జూలీ అన్నారు. దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులు కొనసాగడంతో తీవ్ర ఒత్తిడికి గురై గర్భస్రావం అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నటి జూలీ తన భర్తపై కుట్ర పన్నారని ఆరోపించారు. రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌లో ఆయనను ఇరికించారని అన్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కేసులో తనకు నోటీసులు పంపి వేధిస్తున్నారని, దీని వెనుక టీవీకే వ్యక్తి, ఓ లాయర్ ఉన్నారని ఆమె ఆరోపించారు.
55
మరియా జూలీ కన్నీళ్లు
జూలీ మాట్లాడుతూ.. "మేం మా బిడ్డను కోల్పోయాం. నాకు ఇటీవలే పెళ్లయింది, మా మొదటి బిడ్డను పోగొట్టుకున్నాం. ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన తీవ్ర మానసిక వేదనతో నా బిడ్డ చనిపోయింది. సానుభూతి కోసం నేను దీన్ని వాడుకోవచ్చు, కానీ నా భర్తపై, నాపై పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని చెప్పడమే నా ఉద్దేశం" అని నటి జూలీ కన్నీళ్లు పెట్టుకున్నారు.