Dhanush Mrunal Breakup: ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా..?

Published : Jun 20, 2026, 02:03 PM IST

 Dhanush Mrunal Breakup: చాలా కాలంగా స్టార్ హీరో ధనుష్ తో.. మృణాల్ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరి పెళ్లి అని కూడా అన్నారు. కానీ.. ఈ విషయంపై క్లారిటీ రాకముందే… వీరిద్దరూ విడిపోయారంటూ మళ్లీ రుమార్లు చెక్కర్లు కొట్టడం విశేషం..

PREV
13
ధనుష్- మృణాల్ విడిపోయారా?

సౌత్ స్టార్ హీరో ధనుష్ కొద్ది నెలల క్రితమే తన భార్యతో విడిపోయాడు. విడాకుల తర్వాత… ధనుష్.. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ తో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలిసేలోగా… ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారని.. అది కూడా పరస్పర అంగీకారంతో విడిపోయారంటూ వార్తలు రావడం విశేషం. ఇంతకీ అసలు ఏం జరిగింది..?

23
మృణాల్ - ధనుష్ సంథింగ్ సంథింగ్...

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ధనుష్- మృణాల్ హవానే నడిచింది. ఎక్కడ చూసినా ధనుష్, మృణాల్ ఫోటోలే కనిపించాయి. వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలు బయటకు రావడంతో.. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ.. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగలేదు. మృణాల్ బిజీగా ఉండటం వల్ల పెళ్లి జరగలేదని.. వాయిదా పడిందని అనుకున్నారు. కానీ, తాజాగా.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

ధనుష్, మృణాల్ ఇద్దరూ.. పరస్పర అంగీకారంతో విడిపోయారని.. వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు.. వీరు నిజంగా రిలేషన్ లో ఉన్నారనే విషయంలోనే క్లారిటీ లేకపోతే.. ఇప్పుడు విడిపోయారంటూ వార్తలు రావడం అభిమానులను షాకింగ్ కి గురి చేసింది.

33
రూమర్స్ రావడం వెనక కారణం ఇదే..

ఈ ఏడాది మొదట్లో సన్ ఆఫ్ సర్దార్ 2 సినమా ప్రీమియర్ షోకు మృణాల్, ధనుష్ జంటగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.  వారి మధ్య ఉన్న నువు చూసి.. వీరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

అంతేకాదు.. ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా షూటింగ్ సెట్ లో కూడా మృణాల్ కనిపించారు. అదే సమంలో.. ధనుష్ సోదరి ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను కూడా మృణాల్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో.. వీరి పెళ్లికి  కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై    వీరిద్దరూ అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తుండగా.. సడెన్ గా బ్రేకప్ చేసుకున్నారంటూ వార్త బయటకు రావడం విశేషం. ప్రస్తుతం వీరి బ్రేకప్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి.. దీనిపై అయినా మృణాల్, ధనుష్ స్పందిస్తారో లేదో చూడాలి..

Read more Photos on
click me!

Recommended Stories