సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రానికి తొలి రోజు మంచి వసూళ్లు నమోదయ్యాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సమంత కంబ్యాక్ మూవీ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వాస్తున్నాయి. సమంత సింగిల్ హ్యాండెడ్ గా ఈ చిత్రాన్ని తన భుజాలపై మోసింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత స్టార్ పవర్ తో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి.
25
మా ఇంటి బంగారం కలెక్షన్స్
మా ఇంటి బంగారం చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ లో కలక్షన్స్ జోరు కనిపిస్తోంది. రిలీజ్ కి ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మొదలైంది. తొలి రోజు కలెక్షన్స్ సాలిడ్ గా నమోదయ్యాయి. మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తొలి రోజు మా ఇంటి బంగారం చిత్రానికి 2658 షోలు పడ్డాయి.
35
డే 1 కలెక్షన్స్ ఇవే
దీనితో నేషనల్ వైడ్ గా మా ఇంటి బంగారం చిత్రం 6.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. దెస వ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ చూసుకుంటే 5.35 కోట్లు గా నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ లో మాయా ఇంటి బంగారం చిత్రం తొలి రోజు 4.5 కోట్లు రాబట్టింది. దీనితో సమంత నటించిన ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 10.70 కోట్లుగా నమోదైంది. ఇది మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి.
సమంత మా ఇంటి బంగారం చిత్రం జోరుతో రాంచరణ్ పెద్ది చిత్రానికి కూడా దెబ్బ పడినట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం రోజు మా ఇంటి బంగారం రిలీజ్ కారణంగా పెద్ది వసూళ్ళలో డ్రాప్ కనిపించింది.
55
అనుష్క శెట్టి, రష్మిక లకు చుక్కలు
మరోవైపు సమంత గ్యాప్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన పట్టు నిలుపుకుంది. అనుష్క శెట్టి, రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్లు రీసెంట్ గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలని కూడా మా ఇంటి బంగారం బీట్ చేసింది. అనుష్క శెట్టి ఘాటి మూవీ తొలి రోజు 2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తొలి రోజు 1.3 కోట్లు రాబట్టింది. ఈ చిత్రాలు సమంత మా ఇంటి బంగారం మూవీకి దరిదాపుల్లో కూడా లేవు అనే చెప్పాలి. మా ఇంటి బంగారం చిత్రం ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు.