శ్రీలీల చాలా చిత్రాల్లో గ్లామర్ గా కనిపించింది, డ్యాన్సులు చేసింది. మరి ఆ చిత్రాలన్నీ హిట్ అయ్యాయా అని ప్రసన్న బెజవాడ ప్రశ్నించారు. 2 గంటల కథ ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా అనిపించాలి. అప్పుడు పాటలు, డ్యాన్సులు కథకి బోనస్ అవుతాయి. ధమాకా చిత్రంలో కూడా శ్రీలీల బోనస్ అయింది అని ప్రసన్న అన్నారు. ప్రసన్న కామెంట్స్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. శ్రీలీలకి క్రెడిట్ ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల, రవితేజ మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా అప్పట్లో చర్చ జరిగింది. ప్రస్తుతం శ్రీలీల వయసు 23 ఏళ్ళు, రవితేజ వయసు 57 ఏళ్ళు.