అప్పుడు వెనకాతల నుంచి దేవి గొంతు వినిపించి, ఏమో రాధమ్మ గదిలో ఉండడమే తప్ప కూతురికి సేవ చేయడం లేవా అని అంటుంది. అప్పుడు దేవి గొంతు వినిపిస్తుంది దేవి వచ్చిందా అని బయటకు చూసేసరికి అక్కడ దేవి ఉండదు. ఇంతలో చిన్నయి అక్కడికి వచ్చి, అమ్మ నేను ఎలా మాట్లాడాను? అచ్చు దేవి గొంతులాగే ఉన్నది కదా, దేవిని ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను దేవి ఎలా మాట్లాడతాదో నాకు తెలియదా? ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావా అని అనగా రుక్మిణి చిన్మయి వెనకాతల పరిగెడుతూ ఏయ్ దొంగా అని ఆట పట్టిస్తుంది.