ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ రుక్మిణి ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెనకాతల నుంచి సత్య కమలలు చూసి అక్కంటే మీకు ఎంత ప్రేమ! అని అంటారు.అప్పుడు దేవుడమ్మ,ఎంత ప్రేమున్న నా దగ్గరికి ఎందుకు రావడం లేదు. బతికే ఉన్నాదని తెలుసు కానీ నా దగ్గరికి రావడానికి రుక్మిణి ఏం ఆపుతుంది.సత్య ,కమల మీరు చెప్పండి నేను నాకు తెలియకుండా రుక్మిణికి ఏవైనా హానిచేసేనా లేకపోతే దాన్ని బాధపెట్టేది ఏవైనా చేశానా మరి నా దగ్గరికి రావడానికి ఎందుకు సంకోచిస్తుందో అని బాధపడుతూ ఉంటుంది.