ఎంజీఆర్, రాజీవ్ గాంధీ అంతటి వారిని మెస్మరైజ్ చేశాడు..ఆయన మాత్రం చిరంజీవికి అభిమాని, పిన్న వయసులోనే మృతి

First Published | Nov 21, 2024, 11:52 AM IST

సంగీతంలో ప్రతిభ చాటిన వారు ఎందరో ఉన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ లాంటి వారిని భారత ప్రభుత్వం భారత రత్నగా గుర్తించింది. అయితే చిన్న వయసు నుంచి సంగీత రంగంలో అసమాన ప్రతిభ కనబరిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన పేరు మాండొలిన్ శ్రీనివాస్. 

సంగీతంలో ప్రతిభ చాటిన వారు ఎందరో ఉన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ లాంటి వారిని భారత ప్రభుత్వం భారత రత్నగా గుర్తించింది. అయితే చిన్న వయసు నుంచి సంగీత రంగంలో అసమాన ప్రతిభ కనబరిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన పేరు మాండొలిన్ శ్రీనివాస్. మాండొలిన్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస్ ఎంతో ప్రతిభ చాటుకున్నారు. 

పిన్న వయసులోనే పద్మశ్రీ అందుకున్న వారిలో శ్రీనివాస్ ఒకరు. 1969లో శ్రీనివాస్ పాలకొల్లు లో జన్మించారు. మాండొలిన్ ప్లేయర్ గా బాల్యం నుంచే ప్రతిభ చాటుతూ ఏకంగా ప్రధాన మంత్రుల దగ్గర సైతం సత్కారాలు అందుకున్న వ్యక్తి శ్రీనివాస్. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆయన శిష్యుడు. చాలా మంది శిష్యులని ఆయన తయారు చేశారు. కానీ ఎప్పుడూ ఎవరి దగ్గరా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలదట. 


ఈ విషయాలని దేవిశ్రీ ప్రసాద్  స్వయంగా రివీల్ చేశారు. అప్పట్లో ప్రధాన మంత్రులుగా పని చేసిన వారందరితో ఆయన ఫోటోలు ఉన్నాయి. ఎంజీఆర్, రాజీవ్ గాంధీ అయితే ఆయనకి అభిమానులు. ఆయన ప్రోగ్రాం అయిపోయేవరకు ఎదురుచూసి కలసి వెళ్ళేవాళ్ళు. ఆయన మాత్రం మెగాస్టార్ చిరంజీవికి అభిమాని అట. ఈ విషయాన్ని దేవిశ్రీ  కోటీశ్వరులు షోలో చెప్పారు. దీనితో చిరంజీవి షాక్ అయ్యారు. 

అయితే చిరంజీవి, శ్రీనివాస్ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకే ఒక్క సారి ఫోన్ లో మాట్లాడారట. దేవిశ్రీ మాట్లాడుతూ చిరంజీవి గారికి, జాకీ చాన్ కి ఆయన వీరాభిమాని అని తెలిపారు. కానీ 45 ఏళ్ళ పిన్న వయసులోనే మాండలిన్ శ్రీనివాస్ మరణించారు. 

మాండలిన్ శ్రీనివాస్ శివోమ్ అనే మ్యూజిక్ ట్రస్ట్ ఉందట. ఆయన మరణానంతరం దేవిశ్రీ ప్రసాద్ ఆ ట్రస్ట్ ని కొనసాగిస్తూ అనేక మంచి పనులు చేస్తున్నారు. దీనితో దేవిశ్రీ ప్రసాద్ ని చిరంజీవి అభినందించారు. 

Latest Videos

click me!