అప్పట్లోనే RRR సన్నివేశం, ఎన్టీఆర్ కి కొరడా దెబ్బలు..బ్రదర్ నన్ను కొడితే రణరంగమే అంటూ కృష్ణకి వార్నింగ్

First Published | Nov 21, 2024, 10:15 AM IST

ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వాళ్ళ జూనియర్ గా వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ యువతలో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 70వ దశకంలో కృష్ణకి తిరుగులేని స్టార్ డం వచ్చేసింది. అయినప్పటికీ శోభన్ బాబు, కృష్ణం రాజు, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కృష్ణ అనేక మల్టీస్టారర్ చిత్రాలు చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వాళ్ళ జూనియర్ గా వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ యువతలో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 70వ దశకంలో కృష్ణకి తిరుగులేని స్టార్ డం వచ్చేసింది. అయినప్పటికీ శోభన్ బాబు, కృష్ణం రాజు, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కృష్ణ అనేక మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. అప్పట్లో అభిమానుల మధ్య ఇగో క్లాష్ లు ఉండేవి కానీ ఇప్పుడున్నంత స్థాయిలో లేవు. 

RRR Movie

దీనితో అనేక మల్టీస్టారర్ చిత్రాలు సాధ్యం అయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణ కలసి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో దేవుడు చేసిన మనుషులు ఒకటి. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జయలలిత.. కృష్ణకి జోడిగా విజయనిర్మల నటించారు. మల్టీస్టారర్ సినిమా చేయడం అంటేనే సాహసం.. పైగా ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోని కొట్టడం అంటే ఇంకా రిస్క్. ఎందుకంటే దెబ్బలు తినే హీరో అభిమానులు బాగా హర్ట్ అవుతారు. 


Super Star Krishna

ఇటీవల రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ని.. రాంచరణ్ కొరడాదెబ్బలు కొట్టే సన్నివేశం పెట్టారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోల మధ్య బ్యాలెన్సింగ్ జరగలేదని చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఇలాంటి సన్నివేశమే అప్పట్లోనే ఎన్టీఆర్, కృష్ణ మధ్య దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ప్లాన్ చేశారు. ఈ రెండు చిత్రాల కాంటెక్స్ట్, సన్నివేశాల నేపథ్యం వేరు కానీ కొరడా దెబ్బలు మాత్రం కామన్. 

సన్నివేశం ప్రకారం ఎన్టీఆర్ ని స్తంభానికి బంధించి.. కృష్ణ కొరడా దెబ్బలు కొట్టాలి. సీన్ అంతా రెడీ అనుకున్న సమయంలో ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పారట. అప్పటికి ఎన్టీఆర్ అగ్ర హీరో.. కృష్ణకి కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. దీనితో ఎన్టీఆర్ కృష్ణని హెచ్చరించారట. బ్రదర్ మనిద్దరిని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. మీరు నేరుగా నన్ను కొరడాతో కొడితే థియేటర్లు రణరంగం అవుతాయి అనిపిస్తోంది. ఫ్యాన్స్ ఇద్దరి ఫ్యాన్స్ కి అది మంచిది కాదు. కాబట్టి మీరు కొట్టకుండా జూనియర్ ఆర్టిస్ట్ చేత కొట్టించండి అని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. 

ఎన్టీఆర్ చెప్పింది నిజమే కాబట్టి కృష్ణ అంగీకరించారు. మొదట కృష్ణ దగ్గర ఉన్న కిరాయి వ్యక్తులు ఎన్టీఆర్ ని కొరడా దెబ్బలతో హింసిస్తారు. చివర్లో కృష్ణ కొరడా తీసుకుని కొట్టడానికి ప్రయత్నిస్తుండగా.. ఎస్వీ రంగారావు ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటారు. ఆ విధంగా ఆ సన్నివేశాన్ని కవర్ చేశారు. 

Latest Videos

click me!