ఏఆర్ రెహ్మాన్, మోహినీ డే విడాకులకు లింక్‌, అసలు నిజం ఏంటంటే?

First Published | Nov 21, 2024, 11:25 AM IST

సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహ్మాన్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన గంట తర్వాత, ఆయనతో కలిసి పనిచేసిన మోహినీ డే అనే మహిళ కూడా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది.

ఏఆర్ రెహ్మాన్, మోహినీ డే

సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే, విడిపోవడానికి నిజమైన కారణం ఏంటో వాళ్ళు ఇంకా చెప్పలేదు. అది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏఆర్ రెహ్మాన్, సైరా బాను

ఇంతలో, ఏ.ఆర్. రెహ్మాన్ తో కలిసి పనిచేసిన సంగీత కళాకారిణి మోహినీ డే కూడా తన విడాకుల నిర్ణయాన్ని ప్రకటించింది. రెహ్మాన్ ప్రకటన వచ్చిన గంట తర్వాత ఆయన వద్ద పనిచేసిన బాస్‌ గిటారిస్ట్ మోహినీ డే కూడా తన భర్తతో విడిపోతున్నట్లు చెప్పడంతో, ఈ రెండు సంఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ఊహాగానాలు చెలరేగాయి. ఈ విషయంపై ఏ.ఆర్. రెహ్మాన్, సైరా బానుల న్యాయవాది వందనా షా స్పందించారు.


ఏఆర్ రెహ్మాన్ విడాకులు

ఏ.ఆర్. రెహ్మాన్ కి, మోహినీ డే కి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. సైరా, రెహ్మాన్ ఇద్దరూ స్వచ్ఛందంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని,  నెక్ట్స్ ఏంచేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం వాళ్ళు అంత ఈజీగా తీసుకున్నది కాదని, ఇద్దరూ రియాలిటీకి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు. కాబట్టి వారి పెళ్లి బంధాన్ని కూడా తక్కువగా చేసి చూడలేమన్నారు. 

ఏఆర్ రెహ్మాన్ బాస్‌ గిటారిస్ట్ మోహినీ డే

29 ఏళ్ల మోహినీ డే, ఏ.ఆర్. రెహ్మాన్ తో కలిసి 40కి పైగా మ్యూజికల్‌ కాన్సర్ట్స్ లో పాల్గొంది. కోల్‌కతాకు చెందిన ఆమె మార్క్ హర్ట్‌స్చ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకటన, ఏ.ఆర్. రెహ్మాన్ విడాకుల ప్రకటన వరుసగా రావడంతోనే గందరగోళం ఏర్పడింది.  ఈ నేపథ్యంలో సైరా బాను లాయర్‌ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. రెహ్మాన్‌తో మోహినీకి సంబంధంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. రెహ్మాన్‌, సైరా విడిపోవడానికి కారణం ఆమె కాదని, వీరికి ఆమెకి సంబంధం లేదని తెలిపారు. 

read more:ఏ.ఆర్.రెహమాన్ ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? రిచ్చెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్ !

Latest Videos

click me!