Devatha: ఆదిత్యనే తన తండ్రి అని తెలుసుకున్న దేవి.. మాధవ నిజస్వరూపం తెలుసుకున్న చిన్మయి..?

Published : Nov 03, 2022, 12:21 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 3 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Devatha: ఆదిత్యనే తన తండ్రి అని తెలుసుకున్న దేవి.. మాధవ నిజస్వరూపం తెలుసుకున్న చిన్మయి..?

ఈరోజు ఎపిసోడ్ లో రాధ గుడికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా అది చూసి దేవి సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. మా నాయన చెడ్డ పనులు చేసినాడు కాబట్టి మాయమ్మ దూరంగా పెట్టింది ఇప్పుడు మా నాయన దగ్గరికి వెళ్ళాలి అంటే మంచిగా రెడీ అవుతోంది అని మనసులో దేవి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు రాధ కొబ్బరికాయ తీసుకొని గుడికి వెళుతుంది. దేవి కూడా రాధని ఫాలో అవుతూ గుడికి వెళుతుంది. మరొకవైపు రాధ గుడిలో ఆదిత్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
 

26

ఇంతలో దేవి గుడి లోపలికి వెళుతుంది. దేవుడికి మొక్కుకుంటూ ఎలా అయినా ఈరోజు మా నాయనని చూసేలాగా చేయు స్వామి అని కోరుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య రావడంతో రాధ సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవి బయటకి వెళ్లి చూసేసరికి రాధ వాళ్ళు కనిపించకపోయేసరికి దేవి వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు రాధ దీపాలు వెలిగిస్తూ ఉండగా ఆదిత్య చూస్తూ కూర్చుని ఉంటాడు. అప్పుడు రాద, ఆదిత్యలను ఒక చోట చూసిన దేవి షాక్ అవుతుంది. అమ్మ ఆఫీసర్ ఇద్దరు దీపాలు వెలిగిస్తున్నారు అంటే ఆఫీసర్ సారే మా నాయన అని అనుకుంటూ ఉంటుంది దేవి.
 

36

అప్పుడు దేవి సంతోషంతో ఆదిత్యతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది. దేవి ఆనందంతో వెళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, రాధ ఇద్దరు దీపాలు వెలిగిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వస్తాడు. తర్వాత రాద,ఆదిత్య ఇద్దరు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. మరొకవైపు మాధవ సత్య కి ఫోన్ చేసి గుడిలో జరిగిన విషయం మొత్తం వివరించడంతో సత్యసాక్ అవుతుంది. అప్పుడు సత్య నాకు ఫోన్ చేసి బాధపడకపోతే నువ్వే వెళ్లి నిలదీయొచ్చు కదా అని అనగా ఇది గుడి కథ సత్యా నలుగురిలో నిలదీస్తే నా పరువే పోయేది అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు మాధవ.
 

46

 మరొకవైపు దేవి ఆదిత్య గురించి అసలు నిజం తెలుసుకుని దేవుడితో ఆఫీసర్ సారు కాదు కాదు మా నాయన అటువంటివాడు అంటే నేను నమ్మను మంచోడు అని మాట్లాడుతూ ఉంటుంది. రోజు మా దగ్గరికి వస్తున్నాడు కానీ ఎందుకు నన్ను మా అమ్మని దూరంగా ఉంచుతున్నాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది దేవి. మరొకవైపు దేవుడమ్మ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆమె భర్త వచ్చి ఏం జరిగింది అని అనటంతో ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అని చెబుతుంది.
 

56

 మరొకవైపు మాధవ గుడిలో జరిగిన విషయాన్ని తలుచుకుని ఆనందంగా ఉంటాడు.  ఆ తర్వాత మాధవ చేతులు కడుక్కుంటూ ఉండగా చేతిపై పచ్చబొట్టు జరిగిపోవడం చూసి ఇది చెరిగిపోతే దేవిని నమ్మించడం అంత సులువు కాదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతుంది. అప్పుడు మాధవ స్కెచ్ తో దేవి పేరు రాసుకుంటూ ఉండటం చూసి చిన్మయి ఒకసారిగా షాక్ అవుతుంది.
 

66

ఇప్పుడు ఎందుకు రాధ నీ మీద నాకున్న ప్రేమను చెప్పినా కూడా నన్ను ఇలా చెడ్డవాడిని చేస్తున్నావు అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు చిన్మయి వింటూ ఉంటుంది. అప్పుడు మాధవ దేవి విషయంలో తాను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు అని చిన్మయి విని షాక్ అవుతుంది..

click me!

Recommended Stories