ఈసారి అందరి ముందు రష్మీపై ప్రేమ బయటపెట్టిన సుడిగాలి సుధీర్.. ధనరాజ్, నందు ఆడేసుకున్నారుగా

Published : Nov 03, 2022, 12:06 PM IST

జబర్దస్త్ కారణంగా సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య రిలేషన్ ఏర్పడింది. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు చాలా సందర్భాల్లో సుధీర్, రష్మీ హింట్స్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ పబ్లిసిటీ కోసమే ప్రేమికులుగా నటిస్తున్నారు అనే వాదన కూడా ఉంది.

PREV
16
ఈసారి అందరి ముందు రష్మీపై ప్రేమ బయటపెట్టిన సుడిగాలి సుధీర్.. ధనరాజ్, నందు ఆడేసుకున్నారుగా

జబర్దస్త్ కారణంగా సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య రిలేషన్ ఏర్పడింది. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు చాలా సందర్భాల్లో సుధీర్, రష్మీ హింట్స్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ పబ్లిసిటీ కోసమే ప్రేమికులుగా నటిస్తున్నారు అనే వాదన కూడా ఉంది. సుధీర్ జబర్దస్త్ కి దూరం కావడంతో అభిమానులకు వీరిద్దరి లవ్ ఎంటర్టైన్మెంట్ కూడా దూరం అయింది. 

26

అయితే తాజాగా మరోసారి సుధీర్, రష్మీ లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ గా మారింది. రష్మీ, నందు జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుధీర్ కూడా హాజరయ్యాడు. సుధీర్, రష్మీ చాలా రోజుల తర్వాత ఒకే దగ్గర కనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. 

36

ఛాన్స్ దొరకడంతో వేదికపై ఉన్న నందు, ధనరాజ్ సుధీర్ ని ఆడేసుకున్నారు. రష్మీ కోసం ఒక డైలాగ్ పౌరాణికం స్టైల్ లో చెప్పాలని అడిగారు. అది కూడా రష్మీ కోసం ఎప్పుడూ చెప్పే 'నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా' అనే డైలాగ్ చెప్పాలని కోరారు. 

 

46

ఈ డైలాగ్ పౌరాణిక పద్యం చెప్పే స్టైల్ లో సుధీర్ చెబుతుండగా పక్కనే నందు, ధనరాజ్ కోరస్ చేస్తూ ఆడేసుకున్నారు. రష్మీ కూడా వేదికపైకి వచ్చింది. సుధీర్ ఈ డైలాగ్ చెబుతుండగా రష్మీ కూడా సిగ్గు పడింది. 30 ఏళ్ల నుంచి చెబుతున్న డైలాగ్ కదా.. ఏదో ఇప్పటికి ఇప్పుడు చెబుతున్నట్లు ఆ సిగ్గు ఎందుకు అని ధనరాజ్ సెటైర్లు వేశాడు. 

56

నందు, రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో అంతటా ఆసక్తి నెలకొంది. రష్మీ సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటూ నటిస్తోంది. 

66

అనంతరం సుధీర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం విజయవంతం కావాలని విష్ చేశాడు. రష్మీని రష్మీ గారు అని సంభోధించడంతో ప్రీరిలీజ్ వేడుకలో విజిల్స్ వినిపించాయి. 

click me!

Recommended Stories