Devatha: స్కూల్లో టీచర్ చేత తిట్లు తిన్న దేవి! ఆదిత్య మీద చిరాకుపడ్డ సత్య!

First Published Oct 13, 2022, 12:16 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..సత్య చప్పట్లు కొట్టుకుంటూ రుక్మిణి, ఆదిత్య దగ్గరికి వచ్చి బాగుంది ఒకరేమో నా కోసమే తన జీవితాన్ని వదిలేసి వెళ్లిపోయారు అంటారు, ఇంకొకలేము నుంచి నాతో తప్ప ప్రతి ఒక్కరితోని బయటకు వెళ్తారు చాలా బాగున్నది. నువ్వు చెప్పావు కదా ఆదిత్య మీ ఇద్దరి మధ్య ఏం లేదని మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అది కూడా ఒంటరిగా. ఆదిత్యనీ, నన్నూ విడదీయమని చెప్పావు కదా అక్క ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఎంతగానో నమ్మను మిమ్మల్ని అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, రుక్మిణి కేదో భాదున్నదంటే వినడానికి వచ్చాను.
 

 అంతేకాని నువ్వు అనుకున్నట్టు ఏం జరగడం లేదు సత్య అని అంటాడు. దానికి సత్య,ఇంట్లో నాకు బాధ ఉంది. నా బాధ గురించి నీకు అవసరం లేదు గాని బయటికి వచ్చి మరి బాధలు వింటున్నావు అని తిడుతుంది. పెనిమిటి తో అలా మాట్లాడుతున్నావేంటి సత్య అని రుక్మిణి అనగా, ఆ మాట నువ్వు అంటున్నావా అక్క.నీకు ఉంకో పెళ్లయింది, కుటుంబం ఉన్నది అయినా సరే ఇలాగ బయటికి వచ్చి ఇంకొకరితో మాట్లాడుతున్నావ్ అంటే నీకు సిగ్గుగా లేదా అని రుక్మిణి మీద అరిచి ఆదిత్య తో  పదా అని సత్య అంటుంది. అదిత్య కదలకపోయేసరికి పదా! అని గట్టిగా అరుస్తుంది.
 

అప్పుడు ఆదిత్య సత్య వెనకాతల వెళ్తాడు.రుక్మిణి అక్కడే  బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో రామ్మూర్తి జానకమ్మ దగ్గరికి వచ్చి, దేవుడు మనకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా సరే మనకి ఇలాంటి రోజులు ఇస్తున్నాడు. రాధ మనకోసం ఎంతో కష్టపడుతుంది ముఖ్యంగా నీకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మనకు ఒకవేళ కూతురు ఉన్నా సరే మన గురించి ఇంతలా ఆలోచించదేమో దేవుడు మనకు ఇచ్చిన వరం లాగా రాధ మన ఇంటికి వచ్చింది రాద ఎప్పుడు మనతోనే ఉంటే హాయిగా ఉంటుంది అప్పుడు మనకి కష్టాలు ఉండవు అని అంటాడు.
 

 ఆ తర్వాత సీన్లో మాధవ్, రాధ రాదేంటి, ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అని అనుకోని,ఆదిత్య దగ్గరికే వెళ్ళింది అని అనుకుంటాడు. అప్పుడు ఆదిత్య కి ఫోన్ చేయగా ఆదిత్య ఎత్తడు. అప్పుడు మాధవ్ రోజు రోజుకి రాద ఆదిత్య కి దగ్గర అయిపోతుంది అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో దేవి స్కూల్లో కూర్చొని జరిగిన విషయం అంత ఆలోచించుకుంటూ ఉంటుంది.ఇంతలో టీచర్ అక్కడికి వచ్చి హోమ్ వర్క్ చేసావా అని అనగా దేవి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈమధ్య ఏమైంది దేవి నువ్వు దేనికి సమాధానం ఇవ్వటం లేదు, క్లాసులో సరిగా పాఠాలు వినడం లేదు, దిక్కులు చూస్తూ ఉంటున్నావు.
 

హోంవర్క్ కూడా చేయట్లేదు. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు మాట్లాడుతాను అని అనగా, నాకు నాన్న లేడు అని దేవి అంటుంది. హోంవర్క్ చేయలేదని నాన్న కూడా లేదంటావా ప్రతిరోజు నిన్ను దింపుతుంది ఎవరు అని అనగా,నాకు నాన్న లేరు నాకు నాన్న ఎవరో తెలీదు అని దేవి అరుస్తుంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా, స్కూల్ అనుకుంటున్నావా రా ప్రిన్సిపల్ దగ్గరికి పదా అని వాళ్ళ మేడం అనగా ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది.అప్పుడు టీచర్, ఈమధ్య తిను బాగా చదవడం లేదు,దేని మీద శ్రద్ధ పెట్టడం లేదు అడిగితే నాన్న ఎవరో కూడా తెలియదు అని చెప్తుంది అని అనగా నేను సద్ది చెప్తాను మేడం.
 

వాళ్ళ అవ్వకి ఒంట్లో బాలేనప్పుడు నుంచి దేవి ఇలాగ ఉన్నది అని రుక్మిణి అంటుంది. తర్వాత చిన్మయి అక్కడికి వచ్చి ఏమైంది దేవి మేడంని ఎదిరించి మాట్లాడావట తప్పు కదా అని అంటుంది. అప్పుడు రుక్మిణి దేవితో, నువ్వు ముందు ఎంత బాగా చదివేదానివి దేవమ్మ అందరూ నిన్ను పోడే వారు ఇప్పుడు నిన్ను ఇలా అంటున్నారు బాధగా లేదా ఏమైంది నీకు అని అడుగుతుంది. అప్పుడు చిన్మయి, నేను దేవితో మాట్లాడుతానమ్మ నేను విషయం కనుక్కుంటాను అని చెప్పి దేవిని తీసుకెళ్లి పోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్యా తన గదిలో కూర్చుని ఉండగా సత్య అక్కడికి వచ్చి, అసలు ఏమైంది ఆదిత్య. నీకు, అక్కకి మధ్య ఏం లేదు అన్నావు కదా ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నావు? ఏం జరుగుతుంది నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అక్కడ మీరు ఏకాంతంగా మాట్లాడుతున్నారు. 

నువ్వు కలెక్టర్ ఆఫీస్లో కూలోడివి కాదు కలెక్టర్వి. ప్రెసిడెంట్ గారి కోడలు, నువ్వు ఏకాంతంగా మాట్లాడితే చూసే జనాలు ఏమనుకుంటారు అని అడగగా, ఎవరు నీలా మాత్రం అనుకోరు సత్య. నువ్వు అక్కడ చూసినది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు అని అంటాడు ఆదిత్య. దానికి సత్యా, అక్కడున్నది నా అక్క అయినా దాంతో ఉన్నది నా భర్త. తన భర్తని ఇంకొక ఆడదానితో చూసి ఏ భార్య తట్టుకోలేదు ఆదిత్య. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు ఛీ! అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంతా గుర్తుతెచ్చుకుంటూ రుక్మిణి బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో రామ్మూర్తి అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా అని రుక్మిణి నీ అడగగా, ఏమీ లేదు అని రుక్మిణి అంటుంది. అప్పుడు రామ్మూర్తి, నువ్వు మా ఇంటికి ఎంతో మేలు చేశావమ్మా చిన్మయికి తల్లయ్యావు ఇంట్లో లక్ష్మి లాగా ఉన్నావు. ఇప్పుడు జానకమ్మకు కూడా నువ్వే సహాయం చేస్తున్నావు, నీ మేలు ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ మరువలేరు. 

ఇప్పుడు నువ్వు అలా ఎందుకు ఉన్నావు?నా దగ్గర దాయాల్సిన అవసరం లేదు కదా అని అనగా, మీ కొడుకు వల్లే నేను ఇలా ఉన్నానని మీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుంటుంది రుక్మిణి. అప్పుడు రామ్మూర్తి, ఇంటికి కలే నువ్వు కదమ్మా నువ్వే ఇలా మౌనంగా ఉంటే ఇల్లు బోసిపోదు అని అనగా, నాకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు ఏమైనా అయితే ముందు మీకే చెప్తాను అని రుక్మిణి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రామ్మూర్తి ఆలోచనలో పడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!