మీ అందరి బాధ నేను అర్థం చేసుకుంటున్నాను మరి ఎందుకు నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర నేను రిషి ని కావాలనే బాధ పెట్టడం లేదు అని అంటాడు. ప్రస్తుతం రిషి కొలిమిలో కాలుతున్న ఇనుము లాంటివాడు ఇప్పుడు దేవయాని వదిన రిషి ని ఏం చేయలేదు అని అంటాడు. ఇప్పుడు రిషి ని పెద్దగా పట్టించుకోదు ఇప్పుడు ఏమైనా చేస్తే రిషితన చేతుల్లో నుంచి జారిపోతాడు అని తన భయం అని అంటాడు మహేంద్ర. ఆవిడ ఆట కట్టించాలని రిషి, వసుధర ల బంధం మరింత బలపడేలా చేయాలని నేను ఇలా చేశాను అంటాడు మహేంద్ర.