మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు.. ఏడాదిలోనే తల్లి, తండ్రి, అన్నను కోల్పోయిన సూపర్ స్టార్.. దిగమింగలేని బాధ!

Published : Nov 15, 2022, 08:16 AM IST

ఒక విషాదం నుంచి కోలుకునే లోపే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఇంట్లో  మరో విషాదం నెలకొంటోంది.  వరుస విషాద ఘటనలు ఆయన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకే ఏడాది ముగ్గుర్ని కోల్పోవడంతో దిగమింగలేని బాధను భరిస్తున్నారు. 

PREV
16
మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు.. ఏడాదిలోనే తల్లి, తండ్రి, అన్నను కోల్పోయిన సూపర్ స్టార్.. దిగమింగలేని బాధ!

2022 సూపర్ స్టార్ మహేశ్ బాబును తీరని శోకసంద్రంలోకి నెట్టేసింది. కనికరం లేని కాలం వరుస విషాదాలను కలిగిస్తూ మహేశ్  ను కోలుకోకుండా చేస్తోంది. ఒకే ఏడాది కుటుంబంలో పెద్ద దిక్కుగా  ఉన్న ముగ్గురిని కోల్పోవడంతో దిగమింగలేని బాధలోకి కూరుకుపోయారు. దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
 

26

మహేశ్ బాబు తోబుట్టువులు మొత్తం నలుగురు. దివంగత నిర్మాత, మహేశ్ రమేశ్ బాబు (Ramesh Babu) పెద్ద అన్న కాగా.. పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అక్కాచెల్లెల్లు. అయితే ఈ ఏడాది  ప్రారంభంలోనే అన్న రమేశ్ బాబు మరణించిన విషయం తెలిసిందే. 2022, జనవరి 8న రమేశ్ బాబు అకాల మరణం చెందారు.
 

36

అన్న మరణం నుంచి మహేశ్ బాబు తేరుకునే లోపే తల్లి ఇందిరా దేవి (Indira Devi) కూడా కన్నుమూశారు. కొడుకు చనిపోయిన బాధతో ఇందిరా ఆరోగ్యం మరింతగా చెడిపోయింది. రమేశ్ బాబు చనిపోయిన తొమ్మిదినెలలకే కన్నుమూశారు. 2022, సెప్టెంబర్ 28న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఇందిరా తుదిశ్వాస విడిచారు. 
 

46

అన్న చనిపోయిన... కొద్ది నెలకే తల్లి ఇందిరా దేవి కూడా చనిపోవడంతో మహేశ్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిని కోల్పోయి నెలన్నర కూడా కాకపోవడంతో ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. బరువెక్కిన హ్రుదయానికి ఇప్పుడిప్పుడే సర్దిచెప్పుకుంటున్నారు. ఈలోపే సూపర్ స్టార్ కృష్ణ మరణం మహేశ్ బాబును మరింత శోకసంద్రంలోకి నెట్టేసింది.  
 

56

ఇక కృష్ణ కూడా ఒకే ఏడాది కొడుకు, భార్యను కోల్పోయిన బాధను తేరుకోలేకపోయారు. వారి యాదిలోనే తన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఉన్నట్టుండి ఆదివారం రాత్రి 1: 15 నిమిషాలకు కృష్ణ (Rip Krishna) హార్ట్ ఎటాక్ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. 24 గంటలు ప్రపంచ స్థాయి చికిత్స అందించినా కోలుకోలేకపోయారు. ఈరోజు (నవంబర్ 11)  ఉదయమే కన్నుమూశారు. 
 

66

ఒకే ఏడాదిలో తన కుటుంబానికి పెద్దదిక్కుగా తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా దేవి, అన్న రమేశ్ బాబు ను కోల్పోవడంతో మహేశ్ బాబు  దిగమింగలేని బాధను భరిస్తున్నారు. వరుస విషాదాలను ఎదుర్కొంటున్న మహేశ్ ను ఓదార్చడం కూడా కష్టమే అవుతోంది.  ఈ సందర్భంగా కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానులు మహేశ్ ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. ఇక కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. 
 

click me!

Recommended Stories