ఈరోజు ఎపిసోడ్ లో జగతీ దంపతులు వసుధార తో మాట్లాడుతూ నువ్వు రిషి సంతోషంగా ఉండడమే మాకు కావాలి అందుకోసం ఏమైనా చేస్తాము అని అనగా వెంటనే వసుధార మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు
మీరైనా చెప్పండి అని అనగా వసు మేము ఎవరు మీ ఇంటికి రావడం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు అని అనగా అదేంటి మేడం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా అని వసుధార అడగడంతో అప్పుడు జగతి వసుధార నేను చెప్పేది పూర్తిగా విను అని అంటుంది. రాత్రి దేవయాని అక్కయ్య ఫోన్ మాట్లాడుతుంటే మహేంద్ర విన్నాడు అని అనగా దానికి దీనికి సంబంధం ఏంటి మేడం.