అప్పుడు సౌందర్య మీ అమ్మానాన్నలు లేరు శౌర్య ఆ ఆక్సిడెంట్ లో చనిపోయారు అనడంతో వెంటనే ఇంద్రుడు అలా అనకండి అమ్మ ఏదో ఒక చోట బతికే ఉంటారు అని కవర్ చేసుకుంటాడు. అప్పుడు చారుశీల మీరు కూడా వాళ్లు బతికే ఉన్నారన్న నమ్మకంతో వెతుకుతున్నారు కదా ఆంటీ అని అడగగా అవునమ్మా ఆ నమ్మకాలు ఆశలు మనుషుల్ని దగ్గర చేయాలి కానీ ఇలా దూరం చేయకూడదు కదా అని బాధపడుతుంది సౌందర్య. అప్పుడు సౌందర్య, సౌర్య ని బలవంతంగా తీసుకెళ్తుండగా ఇంద్రుడు సౌందర్య కాళ్ల మీద పడి సౌర్యను తీసుకెళ్లొద్దు అని చెబుతాడు. అప్పుడు సౌందర్య చేసేదేమీ లేక సరే అని అంటుంది. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య దగ్గరికి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుంది.