Guppedantha Manasu: వసుధారకు జగతి వార్నింగ్.. రిషీ కోసం దేవయాని, సాక్షి ప్లాన్‌లు!

Published : Jul 08, 2022, 08:32 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Guppedantha Manasu: వసుధారకు జగతి వార్నింగ్.. రిషీ కోసం దేవయాని, సాక్షి ప్లాన్‌లు!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రిషీ సార్ సాక్షితో సినిమాకు ఎలా వెళ్తాడు అని నిలదీసిన సమయంలోనే రిషీ వచ్చి జగతికి క్యాబ్ బుక్ చేసినట్టు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధార మేడమ్ మీ అబ్బాయి అంటే.. ఆ మా అబ్బాయే ప్రాబ్లెమ్ తనది కాదు నీకు నువ్వే ప్రాబ్లెమ్, ప్రేమ ఎప్పుడు వెల్లడి కావాలి మొబుల్లో చందమామలా ఉండకూడదు అని చెప్పి జగతి వెళ్ళిపోతుంది. మరో సీన్ లో రిషీ వసు గురించి ఆలోచిస్తుంటాడు.
 

27

ఒకప్పుడు వసుధార ఆలోచనలు అర్థం అయ్యేవి ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. మరోవైపు వసు కూడా రిషీ గురించి అలానే ఆలోచిస్తుంది. సాక్షితో సినిమాకు ఎలా వెళదాం అనుకున్నాడు అని సీరియస్ అవుతుంది. ఇక మరో సీన్ లో దేవయాని, సాక్షి ఇద్దరు మాట్లాడుతుంటారు. ఏం చెయ్యాలి ఆంటీ అని అడిగితే దేవయని సలహాలు ఇస్తుంది. రిషీ అభిరుచులు నీ అభి రుచులుగా మార్చుకో అని చెప్తుంది.
 

37

మరో సీన్ లో జగతి మహేంద్ర ఇద్దరు రిషీ, వసుధార ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు ఇద్దరు చెప్పుకోలేకపోతున్నారు.. వాళ్ళ ఇద్దరునే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి.. మనం వాళ్ళ మధ్య దూరకూడదు.. దూరితే మళ్లీ వారి మధ్య దూరం పెరుగుతుంది.. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని మహేంద్రకు జగతి చెప్తుంది. అయిన మాట వినకుండా రిషీ, వసుధారను కలిపేందుకు గౌతమ్ తో మళ్లీ మహేంద్ర ప్లాన్ వేస్తాడు..
 

47

తర్వాతి సీన్ లో అటెండర్ కాఫీ తీసుకెళ్తుండగా.. రిషీ ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. పైన గౌతమ్ సార్, వసుధార మేడమ్ పని చేస్తున్నారు అంటే రిషీ అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని రిషీ వాళ్ళని అడిగితే కొలుస్తున్నాం సార్ అని వసు చెప్తుంది. ఎందుకు ఈ కొలతలు అని అడిగితే క్లాస్ లు ఎగొట్టి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని తిట్టి రిషీ కిందకి వస్తే మహేంద్రను అడుగుతాడు.
 

57

పైన షెడ్ వెయ్యడం కోసం ఆ కొల్తలు వేస్తున్నారు అని అంటే అవసరమా అవి అన్ని.. మీ శిష్యురాలిని ఫస్ట్ దిగమని చెప్పండి అని సీరియస్ గా చెప్పి వెళ్తాడు.. కానీ మనసులో మాత్రం అంతా ఎండలో వసుధార పని చెయ్యడం అవసరమా అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్ లో జగతి క్లాస్ చెప్తుంటే వేరే స్టూడెంట్స్ మాట్లాడితే ఇంకోసారి మాట్లాడితే బయటకు వెళ్తారు అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఈ వసు అవి పట్టించుకోకుండా రిషీ సార్ ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తుంటుంది.
 

67

అప్పుడే రిషీ అలా వెళ్తాడు.. అది చూసి సంబరపడుతుంది. మళ్లీ వెనక్కి సార్ వస్తారా రారా అని కళ్ళుమూసుకొని వేళ్ళతో లెక్కలు వేసుకుంటుంటే అది చూసిన జగతి.. క్లాస్ చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావ్ వసుధార అని తిట్టి గెట్ ఔట్ ఫ్రమ్ మై క్లాస్ అని తిట్టి పంపిస్తుంది. ఆ మాటలకు వసు ఏడుస్తూ బయటకు వెళ్తుంది. ఇక మరో సీన్ లో సాక్షి రిషీ ఆఫీస్ లో వసు జ్ఞాపకాలను చూస్తుంటుంది. అది చూసిన రిషీ నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావ్.. నిన్ను ఎవరు రమ్మన్నారు అని తిట్టి ఆ పువ్వును లాక్కుంటాడు.
 

77

అది కిందపడి విరిగిపోతే సారీ రిషీ అని సాక్షి చెప్తే.. అసలు నీకు బుద్ది ఉందా అని రిషీ సీరియస్ గా తిడుతాడు.. ఆ విరిగిపోయినవి చూసి బాధపడుతాడు. నన్ను డిస్ట్రబ్ చెయ్యద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి.. హేయ్ గెట్ ఔట్ అని అవమానించి పంపిస్తున్న సమయంలో దేవయాని మాటలు గుర్తు తెచ్చుకొని సారీ అని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories