Karthika Deepam: నిరుపమ్‌తో శౌర్యకు పెళ్లి చెయ్యాలని హిమ ఫిక్స్.. కోపంతో రగిలిపోతున్న జ్వాల!

Published : Jul 08, 2022, 07:47 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Karthika Deepam: నిరుపమ్‌తో శౌర్యకు పెళ్లి చెయ్యాలని హిమ ఫిక్స్.. కోపంతో రగిలిపోతున్న జ్వాల!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఇంట్లో జ్వాల ఏడుస్తూ ఉంటే చంద్రమ్మ ఓదారుస్తూ ఉంటుంది. ఏడవకు జ్వాలమ్మ అని చెప్పి చంద్రుడుకు బయటకు వెళ్లి భోజనం తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు ఇంధ్రుడు జ్వాలమ్మ చెప్పు నిన్ను ఎవరు ఏం అన్నారు అంతు చూస్తానని అంటే నువ్వు వెళ్ళు చంద్రుడు ఇప్పుడు జ్వాల ఏం చెప్పలేదు అని అతన్ని పంపిస్తుంది.
 

27

ఇక మరోవైపు ఇంటికి వెళ్తున్న సౌందర్య ఆనంద్ రావు, హిమలు శౌర్య మాటలు గుర్తు తెచ్చుకొని కుమిలిపోతుంటారు. మరో సీన్ లో మరుసటి రోజు ఉదయమే శౌర్య ఇంటి ముందు ఆనంద్ రావు వెళ్లి కూర్చుంటాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావ్ అని అడిగితే.. నా మనవరాలు కోసం వచ్చాను.. దేవుడుని నేను అడిగిన కోరిక తీర్చాడు.. నువ్వు రావడం లేదు అని ఫీల్ అవుతాడు.
 

37

పదా బంగారం వెళదాం.. మీ నానమ్మ ఎదురు చూస్తుంది.. ఎన్నో జ్ఞాపకాలు ఎదురు చూస్తున్నాయ్ అని ఆనంద్ రావు అంటే నా శత్రువు కూడా అక్కడ ఎదురుచూస్తుంది.. నేను ఇంటికి రాను తాతయ్య అని శౌర్య చెప్తుంది. ఈ వయసులో మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తావ్ అమ్మ అని అంటే ఏడిస్తే కష్టాలు పోతాయా అని డైలాగ్ వేస్తుంది. ఆనంద్ రావు ఎన్ని మాటలు చెప్పిన శౌర్య దండం పెట్టి పంపిస్తుంది.
 

47

ఇక మరో సీన్ లో హిమ డాక్టర్ బాబు, వంటలక్క ఫోటో చూస్తూ తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది.  అది చూసిన సౌందర్య వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావే అని అడిగితే ఇక్కడే కదా నేను అన్ని చెప్పుకునేది అని హిమ అంటుంది. శౌర్య కోసం ఎన్ని చేసిన ఉపయోగం లేకుండా పోయింది. శౌర్యతో నిరుపమ్ బావకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది. ఎలాగైనా సరే వాళ్లకు పెళ్లి చేస్తాను అని అంటుంది.
 

57

జ్వాలే శౌర్య అని మీ స్వప్న అత్తకు చెప్పదు.. మీ స్వప్న అత్త గురించి తెలుసుకదా.. ఆటోది అన్నట్టు చులకనగా చూస్తుంది. అప్పుడు హిమ సరే అని అంటుంది. నాపై శౌర్యకు కోపం వెళ్తుంది కదా అని అడుగుతుంది. ఇక అప్పుడే ఆనంద్ రావు వచ్చి బాధ పడుతాడు. శౌర్య మాట్లాడిన విషయాలు అన్ని చెప్పి బాధతో కుమిలిపోతాడు. శౌర్య ఎప్పటికి రాదు ఏమో అని ఆనంద్ రావు సౌందర్యతో బాధపడుతాడు.
 

67

ఇక మరో సీన్ లో జ్వాల ఇంటికి వస్తుంది.. ఇదేంటి తలుపులు తెరిచి ఉన్నాయని లోపలికి వెళ్తే అక్కడ హిమ వంకాయ కూర చేస్తుంటుంది.. అది చూసిన జ్వాల నువ్వెంటే ఇక్కడ అని అడిగితే వంట చేస్తున్న శౌర్య.. ఎంతైనా వంటలక్క కూతుర్లం కదా అని అంటే ఆ వంకాయలను విసరగొట్టి పదవే బయటకు అని శౌర్య తీసుకెళ్తుంది. అప్పుడు హిమ చేతిని వదిలించుకొని నిరుపమ్ తో పెళ్లి చేస్తాను అని మాట ఇస్తుంది. నాకు డాక్టర్ సాబ్ తో పెళ్లి చేస్తావా.. ఎలా కనిపిస్తున్నాను నీకు.. పెళ్లి చేసుకోబోతున్నారు.. పెళ్లి పనులు అన్ని చేస్తున్నారు.. ఇప్పుడు డాక్టర్ సాబ్ తో నాకు పెళ్లి చేస్తావా అసలు నీది నోరేనా అని శౌర్య నిలదీస్తుంది.
 

77

ఆ మాటలకు హిమ నవ్వుతు నీ తొడబుట్టుంది నీకు ఎలా ద్రోహం చేస్తుంది అనుకున్నావ్ శౌర్య ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని హిమ అడుగుతుంది. నువ్వు నన్ను ఎప్పుడో మోసం చేసి చంపేశావ్ అని అంటుంది. అతర్వాత హిమను పదా బయటకు వెళ్ళు అని శౌర్య అంటే నేను వెళ్లడం కాదు నువ్వే మన ఇంటికి రా అని హిమ అంటుంది. కానీ శౌర్య కోపంతో ఇంటి బయటకు గేంటెస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories