Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఫ్యామిలీ అంతా కలిసి పాయసం తింటూ ఉండగా రిషి (Rishi) చేయి అనుకోకుండా వసు పాయసానికి తగిలి అది కింద పడిపోతుంది.
ఇక దాంతో రిషి (Rishi) తన పాయసాన్ని వసును తినమంటాడు. దానికి వసు ఏ మాత్రం ఆలోచించకుండా తినేస్తుంది. దానికి ఫ్యామిలీ అంత ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ దేవయాని మాత్రం చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక జగతి మహేంద్రను పక్కకు తీసుకెళ్లి రిషి మనసులో వసుధార (Vasudhara) ఉంది అని చెబుతుంది.
25
ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. అందులో జగతి (Jagathi) వేసిన ముగ్గు చాలా బావుంటుంది. దాంతో ధరణి "చిన్న అత్తయ్య ముగ్గులు చాలా బాగా వేశారు" అని అంటుంది. దానికి గౌతమ్ (Gautham) చిన్న అత్తయ్య అంటున్నావ్ ఏంటి వదిన అని అడుగుతాడు. దానికి జగతి కవర్ చేస్తుంది.
35
తర్వాత రిషి (Rishi) వసు కాలుకు దెబ్బ తగిలినందుకుగాను టాబ్లెట్ వేసుకో అని తెచ్చి ఇస్తాడు. దానికి వసుధార ఎంతో ఆనందపడుతుంది. తర్వాత రిషి, వసును 'అచ్చమైన తెలుగింటి అమ్మాయి లా ఉన్నావు' అని పొగుడుతాడు. దానికి వసుధార (Vasudhara) ఎంతో ఆనంద పడుతుంది.
45
ఇక వసుధార (Vasudhara) రిషి కు థాంక్స్ చెబుతుంది. ఇక ఆ తర్వాత అక్కడకు గౌతమ్ వస్తాడు. అలా వచ్చిన గౌతమ్ 'అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావు' అని రిషి లానే పొగుడుతాడు. ఇంతకు ముందు ఈ మాట రిషి సార్ చెప్పారు అని వసు చెప్పగా గౌతమ్ (Gautham) కోపడతాడు.
55
తర్వాత జగతి వసుధార (Vasudhara) ను లోపలకు పిలిచి రిషి కోసం కొన్న డ్రెస్ ను వసుకు చూపిస్తుంది. ఎలాగైనా డ్రెస్ ను రిషి వేసుకోవాలని వసుకు చెబుతుంది. ఈ విషయం చాటుగా విన్న దేవయాని (Devayani) ఏదో ఎత్తుగడ వేయనే వేస్తుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.