మరొకవైపు మహేంద్ర కి మినిస్టర్ ఫోన్ చేసి జరిగిన విషయం తెలిసింది చాలా బాధ కలిగింది అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళందరిని రమ్మని చెప్పి మినిస్టర్ ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత గౌతమ్ రిషి ఇద్దరు కలిసి వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ రిషి వైపు అలాగే చూడడంతో ఏమైందిరా అలాగే చూస్తున్నావు అని అంటాడు రిషి. అప్పుడు గౌతమ్, రిషి చెయ్యి పట్టుకొని జరిగిన విషయం గురించి తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి అనడంతో వెంటనే రిషి తప్పులు అందరూ చేస్తారు కానీ నిజాలు దాచిపెట్టడం మరింత తప్పు అని అంటాడు రిషి.