అయితే అనసూయ మదిలో నుంచి ఒక చిత్రం పోవడం లేదట. ఆయా చిత్ర ప్రభావం, ఆ హీరో నటన వెంటాడుతూనే ఉన్నాయి అని అనసూయ అంటోంది. ఆ చిత్రం మరేదో కాదు.. లేటెస్ట్ సెన్సేషన్ కాంతారా. ఈ చిత్ర విశేషాలని అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పై అనసూయ ప్రశంసలు కురిపిస్తోంది.