మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్, నేనేంటో నిరూపిస్తా.. రూల్స్ బ్రేక్ చేస్తానంటోన్న సీతారామం బ్యూటీ

First Published Dec 6, 2022, 9:33 AM IST

రూల్స్ బ్రేక్ చేస్తానంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. హీరోయిన్ అంటే.. అందరిలో ఉండే అభిప్రాయాన్ని చెరిపేస్తానంటోంది మరాఠీ బ్యూటీ..  ఇంతకీ ఏం చేయబోతోందో తెలుసా.. 
 

సీతారామం సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది మృణాల్ ఠాకూర్. వరుస ఆఫర్లు ఆమె గుమ్మం ముందు వాలుతుంటే.. ఆచి తూచి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది బ్యూటీ.. హీరోయిన్ కు ఉన్న హద్దులు చెరిపేస్తానంటోంది. 

Mrunal Thakur

సీతారామం సినిమాలో చేసింది క్లాసిక్ రోల్ అయినా.. బ్యూటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు మృణాల్ ఠాకూర్. తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. 
 

Mrunal Thakur

సాధారణంగా హీరోయిన్లు క్యారెక్టర్ రోల్స్ చేయమంటే చేయరు. ఇక హీరోయిన్ గా మన పని అయిపోయింది అనకున్నప్పుడు మాత్రమే.. అది కూడా అయిష్టంగానే ఈ పాత్రకు సై అంటారు. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు.. యంగ్ హీరోల చెల్లెలి పాత్రల్లో నటించడం మనం ఎప్పుడూ చూసి ఉండం. 

కాని ఇలాంటి పాతకాలపు సెంటిమెంట్లను తాను పట్టించుకోనని చెప్పింది సీతా రామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం పిప్పా అనే హిందీ మూవీలో  హీరో ఇషాన్‌ కట్టర్‌ సోదరి పాత్రలో నటిస్తున్నది మృణాల్. ఈ సినిమా  యుద్ధ నేపథ్యంలో రూపొందుతోంది. 

ఇక మృణాల్ అభిమానులకు ఈ విషయం తెలిసి ఊరుకుంటారా.. వెంటనే ఆమెను ప్రశ్నించారు. చెల్లెలి పాత్ర చేస్తున్నావు కాబట్టి ఇక ముందు ఇషాన్‌ పక్కన హీరోయిన్ గా ఎలా నటిస్తావు అంటూ సోషల్‌మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. వీటిపై మృణాల్‌ ఠాకూర్‌ గట్టిగానే స్పందించింది. అది అపోహ మాత్రమే అంటోంది మృణాల్. 

నెటిజన్లకు రిప్లై ఇస్తూ.. హీరోయిన్లు.. హీరోయిన్ల పాత్రలే చేయాలా..  చెల్లెలు, భార్య క్యారెక్టర్ లో నటించకూడదా..? అలా నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయన్నది అపోహ మాత్రమే. రూల్స్‌ బ్రేక్‌ చేసినప్పుడే మనమెంటో నిరూపించుకోవచ్చు.  అందుకే ఆ రూల్న్ సేను బ్రేక్ చేస్తున్నాను... అన్నారు. 

Image: Mrunal ThakurInstagram

అంతే కాదు ఏ పాత్రలోనైనా నటించి.. ఆడియన్స్ మనసుల్ని దోచుకోకలగాలి.. వారిని మెప్పించడమే నిజమైన సక్సెస్.. అప్పుడే మనలో టాలెంట్ ఉంది అని భావించాలి. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే ఓ గొప్ప పాత్రను మిస్‌ అయ్యానని బాధపడొద్దు.  అందుకే ఇలాంటివి నేను పట్టించుకోను అన్నారు మృణాల్. 

ఇక  పిప్పా సినిమాలో నేను చేసే  చెల్లెలి పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది. అటువంటి మంచి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అంటూ.. సినిమా విశేషాలు పంచుకుంది మృణాల్. ఇక ఈ మూవీ  బ్రిగేడియర్‌ మోహతా రాసిన ‘ది బర్నింగ్‌ చాఫీస్‌’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్నారు.

click me!