
గత ఎపిసోడ్లో వసుధార రిషి ఇద్దరు సంతోషంగా కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ పాతబస్తీకి వెళ్లాలి అనుకుంటుండగా ఇంతలో రిషికి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో వసుధార ఒకటే అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత రిషి ఫణింద్ర మహేంద్ర జగతి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రిషి నేనొక డిసిషన్ తీసుకున్నాను మనం మెడికల్ కాలేజ్ పెడుతున్నాము అనడంతో అందరూ ఒకే ఆల్ ది బెస్ట్ అని చెబుతారు. ఆ తర్వాత బస్తీలో తన పని అయిపోవడంతో వసుధార రిషి సార్ లేకపోతే ఎలాగో ఉంది అనుకుంటూ రిషి కి మెసేజ్ చేస్తుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరూ రిషి వసుధార సంతోషంగా ఉండటం చూసి సంతోష పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి మనలాగే రిషి వసుధారల మధ్య చిక్కు ముళ్ళు వచ్చి పడ్డాయి. వాళ్ల ప్రేమను గెలిపించుకోవడం కోసం గతంలోకి వెళ్లి పొర పత్యాలు అని తొలగించుకొని కొత్త ప్రేమ కథ లాగా మొదలవ్వాలని అనుకున్నారు అప్పుడు వసుధార ధైర్యంగా నిలబడింది అని అంటుంది జగతి. కానీ రిషి నిలబడలేకపోయాడు. ఆడపిల్ల దేంట్లో అయినా సాహసం చేస్తే అన్నింటిని తట్టుకొని నిలబడుతుంది. తాను చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తే ఎదురైన ప్రతి సమస్యతో పోరాడుతుంది అంటూ జగతి వసుధార గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అలా ఈరోజు వసుధార తన ప్రేమను దక్కించుకుంది. ఇద్దరు ఒక్కటి అయ్యారు అని అనగా ఆ మాటలకు మహేంద్ర సంతోష పడుతూ ఉంటాడు.
అప్పుడు మహేంద్ర,జగతి చేతులు పట్టుకుని భూమి మీద ఉన్న స్త్రీ లోకం అంతటికి నేను తలవంచి నమస్కారం అని అంటాడు. అప్పుడు గతంలో జగతి మహేంద్ర మధ్య జరిగిన విషయాల గురించి మహేంద్ర ప్రస్తావించడంతో జగతి ఆలోచనలలో పడుతుంది. రిషి నిన్ను అమ్మ అని పిలవాలి అది నేను వినాలి అని అంటాడు మహేంద్ర. మహేంద్ర రిషితను నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్లేదు తను నా కొడుకు అని అంటుంది. తను సంతోషంగా ఉంటే నాకు అది చాలు అని అంటుంది జగతి. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసుధార ఒకచోట కూర్చుని గోలీలాట ఆడుతూ ఉంటుంది. పిల్లలతో కలిసి గోలిలాట ఆడుతూ ఉంటుంది వసుధార.
అక్క ఇది ఒక్కసారి ట్రై చెయ్ అక్క అని అనగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి నేను ట్రై చేయనా అని అంటాడు. మీరెప్పుడొచ్చారు సార్ అనగా ఒలంపిక్స్ గేమ్ కి నువ్వు రెడీ ఆడుతున్నప్పుడు అనగా ఏంటి సార్ పిల్లల ముందు ఎగతాళి చేస్తున్నారా అని అంటుంది వసుధార. అయిన గోలీలాట ఆడటం అంత సులువు కాదు సార్ అనడంతో నేను గెలిచి చూపిస్తాను అని రిషి గేమ్ ఆడతాడు. అప్పుడు రిషి గేమ్ బాగా ఆడడంతో నువ్వు నా పక్కన ఉన్నావు కదా అందుకే బాగా ఆడాను అని అంటాడు రిషి. తరువాత వసు, రిషి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళగా సార్ నేను ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలుసు సార్ నాకు ఏమైనా జిపిఎస్ ఏమైనా యాడ్ చేశారా అని అంటుంది.
అంతకు మించిన స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అని అంటాడు. మీరు జెంటిల్మెన్ సార్ అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని మీరు కనిపెట్టగలిగారు అని అంటుంది వసుధార. తరువాత రిషి,వసు పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ధరణి వంట ప్రిపేర్ చేస్తుండగా ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి వంటలు ఏమేమి చేశావు అనడంతో ధరణి మెను చెబుతూ ఉంటుంది. ఈ జంటలు ఇంకా ఇంటికి చేరలేదు ఎందుకో నీకు తెలుసా అనగా తెలియదు అత్తయ్య గారు అని అంటుంది. ఏదైనా పని ఉండి ఆగిపోయారేమో అనడంతో ఆ పని ఉందిలే ఆ పేరు చెప్పి జగతి మహేంద్ర చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ కుళ్ళుకుంటూ ఉంటుంది దేవయాని.
అసలు వాళ్ళు తల్లిదండ్రులే కాదు రిషికి నేర్పించాలో కూడా తెలియదు అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఆ మాటలు అర్థం కాక ధరణి తల గీక్కుంటూ ఉంటుంది. అప్పుడు ధరణి తింగరి తింగరిగా మాట్లాడడంతో దేవయాని మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ బాగా కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు కాస్త నోరు ఎక్కువ అవుతుంది కాస్త తగ్గించుకో అని వార్నింగ్ ఇస్తుంది దేవయాని. మరొక వైపు వసు,రిషి ఇద్దరు ఒకచోట కూర్చొని ఉండగా గతంలో వారిద్దరి మధ్య జరిగిన వాటి గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి సరదాగా ఒకసారి కళ్ళు మూసుకో వసుధార అని అంటాడు. నో సార్ నేను ఈ ఆనందాన్ని అస్సలు మిస్ కాను అని అంటుంది.
ఒక క్షణం కళ్ళు మూసుకో చెప్తాను అని అంటాడు రిషి. అప్పుడు వసుధర కళ్ళు మూసుకోవడంతో రిషి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. అప్పుడు వసుధారకి శాలువా గిఫ్ట్ గా ఇవ్వడంతో అది చూసి వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉండగా ఇంతలో వసుధార భుజంపై తల పెట్టుకొని సంతోష పడుతూ ఉంటుంది. నేను నా మెడలో తాళి వేసుకున్నాను. దాని గురించి ఎంత సర్ది చెప్పాలి అన్నా కూడా మీరు నా మాట వినలేదు. కానీ మన ప్రేమ గెలుస్తుందని నాకు తెలుసు సార్ అని అంటుంది. ఈరోజు కోసం నాలో నేను ఎంతో నలిగిపోయాను ప్రతిక్షణం మీ కోసం ఎంతగానో ఎదురు చూశానో అని అంటుంది వసుధార.
ఇకపై మన మధ్య అలాంటి దూరం అటువంటి పరిస్థితులు రాకూడదు సార్ అని అంటుంది. అప్పుడు రిషి తన జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి సగం కొరికి వసుధార తినిపిస్తాడు. అప్పుడు వసు,రిషి ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని సంతోష పడుతూ ఉంటారు. తర్వాత వసుధార రిషి కారులో వెళ్తుండగా సర్ చాలా సమయం అయ్యింది అనగా కానీ అంటాడు రిషి. ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే చాలా బాగుంటుంది వస ధర నేను అదే కోరుకుంటున్నాను అని అంటాడు రిషి. అప్పుడు రిషి మాటలకు వసుధార సంతోషపడుతూ ఉంటుంది. వసుధార పెళ్లి గురించి అడగడంతో నేనొక రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకు పెళ్లి విషయంలో నీ కంటే నాకు ఎక్కువగా తొందరగా ఉంది అంటాడు రిషి. ఆ మాటకు వసుధార సంతోషపడుతూ ఉంటుంది.