సినిమాటోగ్రఫర్ గా అనుపమా పరమేశ్వరన్... మల్టీ టాలెంట్ చూపిస్తున్న మలయాళ బ్యూటీ..

Published : Apr 10, 2023, 11:17 PM IST

హీరోయిన్ మాత్రమే కాదు తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు మలయాళ ముద్దు గుమ్మ.. టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. 

PREV
15
సినిమాటోగ్రఫర్ గా అనుపమా పరమేశ్వరన్... మల్టీ టాలెంట్ చూపిస్తున్న మలయాళ బ్యూటీ..

హీరోయిన్ గా కమర్షియల్ క్యారెక్టర్లుకు పరిమితం కాకుండా.. అద్భుతమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తుంది అనుపమా పరమేశ్వరన్. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసుకుంటూ.. తనలో టాలెంట్ ను నిరూపించుకుంటున్న ఈ హీరోయిన్ తనలో మల్టీ టాలెంట్ ఉందని మరోసారి నిరూపించుకుంది. 

25

దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నటి అనుపమ పరమేశ్వరన్. నటిగానే కాక తనలో మంచి ప్రొఫెషనల్  సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.  సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో DOP గా మారి అందరిని ఆశ్చర్య పరిచింది అనుపమా. 

35

ఈ షార్ట్ ఫిల్మ్‌ను చాయ్ బిస్కెట్  యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అయ్యి ఉంది.  ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు.  అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ తిరిగే కథ ఈ షార్ట్ మూవీ. 

45
Anupama Parameswaran

వరుసగా సినిమాలు.. వరుస  హిట్స్ తో  బిజీగా  ఉన్న  హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ . ఆ రకంగా  ఓ రికార్డ్  సృష్టించింది. అనుపమ పరమేశ్వరన్  చివరిగా బటర్‌ఫ్లై, క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది. సినిమాటోగ్రాఫర్ గా  అనుపమ పనితనానికి..  విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి .

55

రీసెంట్ గా తెలుగులో కార్తికేయ2, 18 పేజస్ మూవీస్ తో హిట్ అందుకుంది అనుపమా. ఆతరువాత ఆమెకు తెలుగులో సినిమాలు లేవు. మలయాళంలో ఒక సినిమా చేస్తున్న ఆమె.. తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అవి కాకుండా సోషల్ మీడియాలో కూడా తన టాలెంట్ చూపిస్తోంది అనుపమా పరమేశ్వరన్. వరుస ఫోటో షూట్లతో రచ్చ చేస్తోందిత. 

click me!

Recommended Stories