ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసుకి చాలా మత్తుగా ఉండి, పరీక్ష అయలేకపోతుంది.అప్పుడు రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసు,ధైర్యం తెచ్చుకొని నేనెలాగనే పరీక్ష రాయాలి అని పరీక్ష రాస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న జగతి, మహీంద్రా, రిషి వసు పరీక్ష రాయగలుగుతుంది అని ఆనందపడతారు. ఆ తర్వాత సీన్లో జగతి మహీంద్రాలు రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.ఒక రాత్రి అంతా నరకం చూసాను అనుకో ఒక వైపు వసు ఎలాగున్నాది అని, ఇంకొక వైపు పరీక్ష రాయగలుగుతుందో లేదో అని కానీ ఆఖరికి రాసింది అదే చాలు అని అనుకుంటారు.