సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది. ఖలేజా తరువాత దాదాపు 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తరువాత వీరి కాంబోలో ఓ భారీ మూవీ రూపొందుతోంది. SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఎప్పుడో రెండు నెలల క్రితమే ఓపెనింగ్ చేసుకున్న ఈసినిమా.. ఈనెలలోసెట్స్ మీదకు వెళ్లబోతోంది.