అప్పుడు దీప,మిమ్మల్ని డాక్టర్ బాబు అని మొనితని డాక్టర్ అమ్మా అని పిలవాలని ఉంది నన్ను దీనికి కాదనకండి అని అంటుంది. మొనిత చిరాగ్గా వద్దన్నా సరే కార్తీక్ పోనీలే పిలవనీ అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఆ బిర్యానీ తిన్నాడు,దీప ఆనందం గా వడ్డించింది.అప్పుడు కార్తీక్,ఇలాగే ప్రతి రోజు చేయు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడు దీప మొనిత తో చూసావా ప్రతిరోజు తెమ్మన్నారు,ఆయన మనసులో నాకంటూ ఒక చోటు ఉంది, అందుకే నేను వచ్చినప్పుడల్లా అంత ఉత్సాహంగా ఉంటున్నారు.