అప్పుడు రిషి కప్ ఆ, సాసర్ ఆ అని అడగగా, ఏదో ఒకటి సార్ ఏదైనా పర్లేదు అని అడ్జస్ట్ అవుతాను ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోని అని వసు అంటుంది. చిన్న చిన్న విషయాల్లో అలా ఉంటావుగాని ఎందుకు వసుధారా ఆ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వవు అని రిషి అడుగుతాడు. దానికి వసు, మనం ఒకటి అనుకుంటే జీవితాంతం అదే మనకు శాశ్వతం కానక్కర్లేదు సార్ అభిప్రాయాలు మారుతాయి మీ విషయంలో కూడా మారొచ్చేమో అని అంటుంది. అప్పుడు రిషి నన్ను ఎందుకు ఇంత గౌరవిస్తావు నువ్వు అని అడగగా సమయం సందర్భం వచ్చినప్పుడు మీకే చెప్తాను సార్ అని వసు అంటుంది.