
శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కొణతాల మోహన్ నిర్మించారు. నరేష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రధారులు చేయగా అలీ హీరోగా మౌర్యాని హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 28 నుండి ఆహా లో స్ట్రీమింగ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
అన్యోన్య దంపతులుగా శ్రీనివాసరావు(నరేష్) -సునీత (పవిత్ర లోకేష్) జీవనం సాగిస్తూ ఉంటారు. ఆదర్శ దంపతులుగా మధ్య వయసులో కూడా ఇద్దరూ ఒకరి పై ఒకరు ఎనలేని ప్రేమాభిమానాలు చూపించుకుంటూ ఉంటారు. తమ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్న శ్రీనివాసరావు - సునీత జీవితాలు.. అలీ (మహమ్మద్ సమీర్) తీసిన ఓ ఫోటో కారణంగా అస్తవ్యస్తం అవుతాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన మహమ్మద్ సమీర్(అలీ) కి సెల్ఫీల తీసుకోవడం అంటే క్రేజ్. ఆ కారణంగా ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఏమిటి ఆ సమస్య ? శ్రీనివాసరావు - సునీత జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ ఇబ్బందుల నుండి వారు ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.
ఇది యూనివర్సల్ స్టోరీ కావడంతో రీమేక్ అయినప్పటికీ నేటివిటీ ప్రాబ్లమ్ లేదు. సోషల్ బర్నింగ్ టాపిక్ తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఎక్కడా రీమేక్ అన్న భావన కలగదు. మలయాళ చిత్రం వికృతి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది కూడా తక్కువే కావడంతో స్ట్రైట్ ఫిల్మ్ వలె అనిపిస్తుంది. నిజ జీవిత పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సొసైటీ దూరం పెడితే, వాళ్ళ కేరీర్స్ నాశనం చేస్తే ఎంత స్ట్రగుల్ ఉంటుందో చెప్పిన తీరు బాగుంది. సదరు పాత్రలకు నరేష్, పవిత్రలను ఎంచుకోవడం కరెక్ట్ అన్న భావన కలుగుతుంది. వారిద్దరూ ఫ్యామిలీ డ్రామాలో లీనమై నటించారు.
నరేష్ - పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ, బాధ ప్రేక్షకుడ్ని సినిమాతో ట్రావెల్ చేసేలా చేస్తాయి. వీటితో పాటు సినిమాలోని మెయిన్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీలో పాత్రలు సహజంగా నిజజీవితాలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి పాత్ర అర్ధవంతంగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. పైగా ఈ సినిమాలో సోషల్ మీడియా ద్వారా ఒక సాధారణ మనిషి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనే కోణంలో కొన్ని కఠినమైన వాస్తవాలను చాలా వాస్తవికంగా చూపించడం చాలా బాగా ఆకట్టుకుంటుంది.
అలీ చాలా కాలం తర్వాత లీడ్ రోల్ చేశారు. లవర్ బాయ్ సన్నివేశాల్లో ఆయన ప్రెజెన్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు మెప్పించారు. ఎలాంటి ఎలివేషన్స్ లేని హీరో పాత్రలో ఆయన చాలా వరకు సహజంగా నటించారు. అలీ కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. సింగర్ మను నరేష్ నైబర్ గా చేశారు. ఇక కథలో కీలక మలుపుకు కారణమైన పాత్రలో లాస్య మెప్పించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. అన్ని పాత్రలకు పరిచయం, ఫేమ్ ఉన్న నటులను తీసుకున్నారు.
మిడిల్ క్లాస్ ఎమోషనల్ కథను ఎంటర్టైనింగ్ చెప్పడానికి కామెడీ, లవ్ ట్రాక్ వంటి కమర్షియల్ అంశాలు జోడించారు. ఆ ప్రయత్నం కొంత మేర సక్సెస్ అయ్యింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాకు దర్శకుడు ఇచ్చిన ముగింపు బాగుంది. కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి సంఘటనను, వ్యక్తులను వైరల్ చేసే వాళ్లకు ఇదో కనువిప్పు అని చెప్పాలి.మనం సింపుల్ గా తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎంత దారుణంగా దెబ్బతీస్తాయో చక్కగా చెప్పారు. ఇది ప్రజెంట్ సోషల్ బర్నింగ్ టాపిక్. ఈ ప్రయత్నానికి చిత్ర టీమ్. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి, సనా, భద్రం, లాస్య,మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి,వివేక్, సప్తగిరి, పృధ్వీ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు
చివరి వరకు ఏం జరుగుతున్నదన్న ఉత్కంఠ ఆసక్తి కలిగిస్తుంది. తన తొందరపాటు పనివలన ఒకరిని ఇబ్బందుల్లోకి నెట్టి తాను ఇబ్బందులు పడే వ్యక్తిగా అలీ ఆసక్తి కలిగించారు. అయితే స్లోగా సాగే కథనం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే సినిమాలో మెలో డ్రామా ఎక్కువైంది. కథలో ఎమోషన్ ఉన్నప్పటికీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు మనసులను మరింత గట్టిగా తాకలేదు. ఒరిజినల్ లో క్యారీ అయిన స్ట్రాంగ్ ఎమోషన్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీలో మిస్సయింది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య,మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
అలీ యాక్టింగ్
నరేష్ - పవిత్రా లోకేష్ నటన వాళ్ళ కెమిస్ట్రీ
మూవీ ప్రధాన ప్లాట్
భావోద్వేగ సన్నివేశాలు
బీజీఎం
మైనస్ పాయింట్స్:
స్లోగా సాగే కథనం
కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్
అలీ కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఉంది. ఆయన మళ్ళీ హీరోగా చేస్తే చూడాలని ఆశపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.అలాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి.ఇక నరేష్ - పవిత్రా లోకేష్ మమేకమై నటించారు వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతం. ఇక అలీ నటన సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్ళింది. బలమైన కథ కథనాలు ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ నిరూపించింది. స్లోగా సాగే కథనం అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ సీన్స్ మినహాయిస్తే మొత్తంగా ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.
రేటింగ్: 3 / 5
నటీనటులు: అలీ, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు
నిర్మాత : కొనతాల మోహన్
రచన, దర్శకత్వం: శ్రీపురం కిరణ్
డిఓపి : ఎస్. మురళి మోహన్ రెడ్డి
సంగీతం : రాకేశ్ పళిడమ్
పాటలు : భాస్కరభట్ల రవికుమార్
ఎడిటర్ : సెల్వకుమార్