Karthika Deepam: శౌర్యను కలుస్తున్నానన్న ఆనందంతో దీప.. మోనితకు రాక్షసత్వన్ని చూపించించిన కార్తీక్!?

Published : Oct 28, 2022, 08:11 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 28వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: శౌర్యను కలుస్తున్నానన్న ఆనందంతో దీప.. మోనితకు రాక్షసత్వన్ని చూపించించిన కార్తీక్!?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఇంద్రుడు ఆటో దిగి జరిగిన విషయమంతా గుర్తుతెచ్చుకుంటూ ఇన్ని రోజులు జ్వాలమ్మ ని మా కన్న కూతురులాగే చూసుకున్నాము మా బిడ్డ పోయిన తర్వాత దేవుడు మాకు ఇచ్చిన వారం అనుకున్నాము. జ్వాలమ్మ తన అమ్మా నాన్నలను వెతుకుతుంటే వాళ్ళు చనిపోయారు అన్న ధైర్యంతో ఉన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు కచ్చితంగా జ్వాలమ్మ వాళ్ళ అమ్మ నాన్న లాగే ఉన్నారు. ఇప్పుడు జ్వాలమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు నన్ను జ్వాలమ్మ దగ్గర నుంచి దూరం చేస్తారు. చంద్రమ్మ అయితే జ్వాలమ్మ లేకుండా బతకలేదు. నన్ను క్షమించు జ్వాలమ్మ నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది కానీ నేను నిన్ను ఎవరికీ ఇవ్వలేను అని ఏడుస్తూ ఆటో దగ్గరే కూర్చుని ఉండిపోతాడు  ఇంద్రుడు. ఆ తర్వాత సీన్ లో దీప, కార్తిక్ కార్లో వెళ్తూ ఉండగా ఆనందపడుతూ ఆ పాప శౌర్య ఏమో అని నాకు చాలా నమ్మకంగా ఉన్నది 

28

డాక్టర్ బాబు నిజంగా శౌర్య అయితే నాకన్నా ఆనందంగా ఇంక ఎవరు ఉండరు మన పాప దొరికేసినట్టే అని అనగా కార్తీక్ ఎందుకో సంకోచిస్తాడు. ఎందుకు అలా ఉన్నారు డాక్టర్ బాబు అని అడగగా నిజంగా అది శౌర్య అయితే తిరిగి నీకు ఇస్తారు అనుకుంటున్నావా అని అంటాడు కార్తీక్. దానికి దీప సంకోచిస్తూ అలా ఎందుకంటున్నారు డాక్టర్ బాబు శౌర్య నా పాప. నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని అనగా అతని మాటలు బట్టి అయితే ఆ పాప తన సొంత కూతురు అయి ఉండాలి లేకపోతే శౌర్య ను తన సొంత కూతురు లా చూసుకుని ఉండాలి అని కార్తీక్ అంటాడు. అవును శౌర్య ని తన సొంత కూతుర్ల చూసుకుంటున్నారు శౌర్య నా బిడ్డే అని దీప అనగా, మరి సొంత బిడ్డను తిరిగి ఇస్తారా ఇన్ని రోజులు అంత ముద్దుగా పెంచారు కదా అని అంటాడు కార్తీక్.
 

38

వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా శౌర్య నన్ను చూసిన వెంటనే వచ్చేస్తది కదా అని దీప బయటికి అంటూ మనసులో మీకు కూడా గతం గుర్తుంటే నా దగ్గరికి వచ్చేసరికి వారు కదా డాక్టర్ బాబు నాకు ఇంత సమస్య వచ్చేదే కాదు అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ మనసులో, విడిపోయిన మన కుటుంబం అంతా కలవాలి దీప నేను అలా చేస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో మోనిత కావేరికి ఫోన్ చేసి, ఆ వాణి ని నువ్వు చెప్పావని ఇక్కడికి తీసుకొని వచ్చాను అది ఇప్పటికి వచ్చి ఏ పని కూడా చేయలేదు అని అంటుంది. దానికి కావేరి, అక్కడున్నది వాల్తేరు వాణి నువ్వేం కంగారు పడొద్దు. నీటిగా పనిని పూర్తి చేసేస్తాది అని అంటుంది. ఏమో కావేరి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని మోనిత అంటుంది. టెన్షన్ ఎందుకు అని పక్కనుంచి కార్తీక్ అంటాడు. కార్తీక్ ని గమనించిన మోనిత వెంటనే ఫోన్ కట్ చేసి ఇలా అడ్డంగా దొరికిపోతుంది ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటుంది. 

48

ఎవరితో మాట్లాడుతున్నావో అని కార్తీక్ అనగా కావేరితో మాట్లాడుతున్నాను అని మోనిత అంటుంది. ఇప్పుడు ఎందుకు కావేరితో మాటలు ఏ పనులు లేవు కదా అని కార్తీక్ అంటాడు. ఏంటి కార్తీక్ నీకు అంత అనుమానం దుర్గతో మాట్లాడితే ఇంకోలా అర్థం చేసుకుంటావు. కావేరితో మాట్లాడిన కూడా అలాగే అర్థం చేసుకుంటున్నావా. నువ్వు దీపతో బయటికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత నేను నిన్ను ప్రశ్నించక ముందే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా నీ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి అని అనగా ఎక్కువ మాట్లాడొద్దు మోనిత అయినా దుర్గతో జరిగినవన్నీ, నేను చూసినవన్నీ అబద్ధాలు అని నాకు నిరూపించుతావా అని అడుగుతాడు. దానికి మోనిత వాళ్ళ పెళ్లి ఫోటో ను చూపించి ఇదే దానికి సాక్ష్యం కార్తిక్ అని అంటుంది. అప్పుడు కార్తీక్, దీప కార్తీక్ ల పెళ్లి ఫోటో చూపించి నా దగ్గర కూడా దీపది,నాది పెళ్లి ఫోటో ఉన్నది అలాగని దీపకు, నాకు పెళ్లి అయిపోయినట్టేనా అని అంటాడు. 

58

అదే సమయంలో దుర్గా అక్కడికి వస్తాడు దుర్గ గారు మేము చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాము దయచేసి బయటకు వెళ్ళండి అని కార్తీక్ అంటాడు. ఇప్పటికే సార్ ఫైర్ మీద ఉన్నట్టున్నారు అది చాలు అనుకొని దుర్గ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పు మోనిత దీనికి నువ్వు ఏ సమాధానం ఇస్తావు. ఊరుకుంటున్నాను కదా అని చెప్పి రెచ్చిపోతున్నావు ఇంకోసారి నా జోలికి, దీప జోలికి రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. దానికి మోనిత ఆశ్చర్యపోయి కంగారుపడుతుంది. ఆ తర్వాత సీన్ లో చంద్రమ్మ ఇంద్రుడు రాలేదని వేచి చూస్తుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి బాధగా వస్తాడు. జ్వాలమ్మ ఎలా ఉన్నది అని అనగా వాళ్ళ అమ్మని తలుచుకుంటుంది ఈ సమయంలో వాళ్ళ అమ్మ ఉంటేనే కదా తనకి తోడుగా ఉంటుంది. ఎవరైనా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తారు వాళ్ళ అమ్మ దొరికితే బాగుండు కానీ ఇప్పుడు లేరు కదా పాపం చాలా బాధపడుతుంది అని అంటుంది.

68

ఆ మాటలు విని ఇంద్రుడు కూడా బాధపడతాడు. అప్పుడు చంద్రమ్మ, ఏమైంది గండ డబ్బులు దొరకలేదా అందుకేనా అలా ఉన్నావు నా డబ్బులు తీసుకెళ్లి ఏమైనా కొను అని అనగా ఇంద్రుడు నగలు, డబ్బులు, చీరలు చంద్రమ్మకి ఇస్తాడు.ఇన్ని డబ్బులు ఎక్కడివి గండ దొంగతనం చేసావా అని అడగగా, నీ మీద ఒట్టు చంద్రమ్మ దొంగతనం చేయలేదు ఏ తప్పుడు పని చేయలేదు నేను తర్వాత వస్తాను అని ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. నా దగ్గర నుంచి గండ ఏదో దాస్తున్నాడు అని చంద్రమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో దీప తన ఇంట్లో పిండి వంటలు అన్ని చేసి రేపు పాపని చూడబోతున్నాను అది శౌర్య అయితే చాలు దేవుడా నాకు ఇంకేమీ వద్దు. శౌర్యను చూస్తే డాక్టర్ బాబుకి కూడా గతం గుర్తొస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో వాణి అక్కడికి వచ్చి ఇన్ని పిండి వంటలు చేస్తున్నావెందుకు వదిన అని అంటుంది.

78

 అప్పుడు దీప నా కూతురిని చూడడానికి వెళ్తున్నాను కానీ తన పుష్పవతి అయింది అని జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇంతలో దుర్గ స్వీట్లు పట్టుకొని వచ్చి, దీపమ్మ ఇప్పుడే మోనిత తింటికెళ్ళి వస్తున్నాను కార్తీక్ సార్ మోనిత ని రఫ్ ఆడిస్తున్నారు అని అంటాడు. ఎందుకు దుర్గ నాకు చెప్పలేదు. నేను కూడా చూసేదాన్ని కదా అని దీప అంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇలాంటివి చాలా ఉంటాయి దీపమ్మ ఎదురుచూడు అని అంటాడు దుర్గ. ఈ మాటలని వాణి వింటుంది. అదే రోజు రాత్రి అందరూ పడుకున్నప్పుడు మోనితకు జరిగిన విషయం అంతా చెప్తుంది వాణి.
 

88

 వాళ్లు శౌర్యని కలవకూడదు.శౌర్య ని కలిస్తే సగం లో ఆగిపోయిన వాళ్ళ జీవితం తిరిగి ప్రారంభమవుతుంది. ఆనందంగా గడుస్తుంది అనుకునే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!
 

click me!

Recommended Stories