వసును దూరం పెడుతున్న రిషి.. మన రూట్ మారింది అంటూ సీరియస్ వార్నింగ్?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 03, 2021, 11:24 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
వసును దూరం పెడుతున్న రిషి.. మన రూట్ మారింది అంటూ సీరియస్ వార్నింగ్?

రిషి (Rishi) కాలేజ్ దగ్గరికి రాగా వసును చూసి తన కంటి గాయం గురించి అడగాలని అనుకుంటాడు. మళ్లీ వసు వైపు చూడగానే తనతో శిరీష్ (Sireesh) ఉన్నట్లు ఊహించుకొని వెంటనే కోపంతో రగిలిపోతాడు. మళ్లీ తేరుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

29

ఇక రిషి (Rishi) వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తున్న సమయంలో ఫణీంద్ర వర్మ (Phanindra varma) మిషన్ ఎడ్యుకేషన్ గురించి న్యూస్ పేపర్ వాళ్ళు ఆర్టికల్ ఇవ్వమన్నారు అని అనడంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఆ బాధ్యతలు చూసుకోమని రిషికి చెబుతారు.
 

39

ఇక వెంటనే మహేంద్రవర్మ (Mahendra Varma) ఇంకెవరు వసుతో రాయిస్తే సరిపోతుందని అనేసరికి రిషి అలాగే ఉండిపోతాడు. దేవయాని కోపంతో రగిలిపోతూ మళ్లీ జగతి, వసు ల గురించి కావాలని తీసి గొడవ పెడుతుంది. దాంతో రిషి (Rishi) వసుతో కాకుండా మరొకరితో రాయిస్తాను అని అంటాడు.
 

49

మహేంద్రవర్మ ప్రశ్నించడంతో.. రేపు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకోసం కాలేజ్ మొత్తం మూసివేయం కదా అని అనేసరికి ఇప్పటికీ ఇంకా మనసులో మాట  బయట పెట్టలేదని అనుకుంటాడు మహేంద్ర వర్మ. మరోవైపు వసు (Vasu) రిషి (Rishi) తన కంటికి పెట్టిన ఆవిరి గురించి తలచుకుంటూ నవ్వుకుంటుంది.
 

59

అప్పుడే జగతి (Jagathi) వచ్చి అడగటంతో రిషి సర్ తనకు ఆవిరి పెట్టాడని చెబుతుంది. ఇక జగతి జ్ఞాపకాలను ఎక్కువగా ఊహించుకోవద్దు అని వసుకు సలహా ఇచ్చి వెళుతుంది. మహేంద్రవర్మ దగ్గరికి ధరణి (Dharani) వచ్చి రిషి గురించి మాట్లాడుతుంది.
 

69

రిషి (Rishi) ఎందుకో సైలెంట్ గా ఉన్నాడని.. ప్రతి ఒక్క విషయం తనతో పంచుకునే వాడని.. ఇప్పుడు ఏ విషయాలు చెప్పటం లేదని ధరణి అంటుంది. వసు కాలేజీకి వచ్చాక రిషిలో చాలా మార్పులు వచ్చాయని అంటుంది. ఇక వీరిద్దరూ మాట్లాడటం చూసి దేవయాని (Devayani) ఏం మాట్లాడుకున్నారో అని ఈర్షపడుతుంది.
 

79

కాలేజీలో వసు  తన ఫ్రెండ్ పుష్పతో (Pushpa) సిలబస్ గురించి మాట్లాడుతుంది. ఇక పుష్ప వసు రింగ్ చూసి తీసుకుంటున్న సమయంలో కిందపడిపోయి రిషి దగ్గర పడుతుంది. రిషి (Rishi) వచ్చి రింగ్ గురించి అడగగా వసుది అని తెలిసేసరికి తనకు ఎంగేజ్మెంట్ సీన్ గుర్తుకొస్తుంది.
 

89

వెంటనే రింగ్ కింద పడిపోగా వసు తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ రింగు ఎంతో ఇష్టమని అనేసరికి రిషి (Rishi) బాధపడతాడు. ఇక తన కేబిన్ కి పుష్పను (Pushpa)రమ్మనడంతో భయంతో వసుని తీసుకెళ్తుంది. వసు రావడం చూసి రిషి తనపై అరుస్తాడు.
 

99

పుష్పకు ఆర్టికల్ గురించి చెప్పి రాయమంటాడు. వసు (Vasu) నేను రాస్తాను సార్ అనేసరికి తనపై మళ్లీ అరుస్తాడు. మళ్లీ కూల్ అయ్యి తన కంటి నొప్పి గురించి అడుగుతాడు. వసు సంతోషంగా సమాధానమిస్తుంది. మళ్లీ తనకు రింగ్ కనిపించటంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్లను అక్కడినుంచి పంపిస్తాడు. తరువాయి భాగంలో వసు రిషితో (Rishi) కావాలని దూరం పెడుతున్నారు అనటంతో మన రూట్ మారిందని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రిషి.

click me!

Recommended Stories